గుంటూరు
ఏప్రిల్ 09.
రాష్ర్ట పశుసంవర్ధక,మత్స్యశాఖా మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ ప్రెస్ మీట్
గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి
సోషల్ డిస్టెన్స్ పాటించాలి.స్వీయనిర్బంధంలో మీ ఇళ్లల్లో ఉండాల్సిందే.రోడ్లపైకి రావద్దు.గుంపులుగా చేరవద్దు.
లాక్ డౌన్ కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా సడలింపులు ఇచ్చాం.
కేసులు పెరుగుతున్నదృష్ట్యా ఉదయం తొమ్మిది లోపే పనులు చక్కబెట్డుకోవాలి.నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తప్పవు.
సోషల్ మీడియాలో రూమర్స్ కాకుండా సరైన విధానంలో ప్రజలకు అవగాహన కల్పించేవిధంగా సూచనలు చేయాలి.
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా అదుపులోనే ఉంది.
నగరాలు, పట్టణాల్లో మాత్రం జనం యథేచ్ఛగా తిరుగుతున్నారు.ప్రభుత్వ సూచనలు పాటించాలి.పరిశుభ్రత,భౌతికదూరమే ఆయుధం.
పోలీసు, వైద్య, రెనిన్యూ ,పంచాయితీరాజ్,మున్సిపల్ ఇలా అన్ని శాఖలు సమగ్రంగా పనిచేస్తున్నాయి
కరోనా హెచ్చరికలు వచ్చిన దగ్గర్నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ నిరంతరం కరోనా నియంత్రణ చేయడానికి నిరంతరం రివ్యూలు చేస్తున్నారు
ఇంతటి క్లిష్టసమయంలో కూడా చంద్రబాబు మాత్రం రాజకీయ విమర్శలు చేస్తున్నారు.దిగజారి ప్రవర్తిస్తున్నారు.
40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు కావాల్సింది రాజకీయం తప్ప
ప్రజల బాగోగులతో ఆయనకు పనిలేదు
కరోనా నేపధ్యంలో ఆక్వారంగానికి సమస్యలు వచ్చి సమీక్ష చేస్తే దాన్నీ తప్పు పడుతున్నారు.దానిపై కూడా టిడిపి ఎంఎల్ ఏ ప్రచారంకోసం నిరసన తెలియచేడం వింతగా ఉంది.
పంటలకు మధ్దతు ధరలు కల్పించేలా చేయడం,రైతులు ఆదాయం కోల్పోకుండా మేం కాపాడే ప్రయత్నం చేస్తున్నాం.
వీడియో కాన్ఫరెన్స్ లతోనే టెలికాన్ఫరెన్స్ లతోనో మేం చేయం.రైతులకు చేరువగా వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నాం
ఆక్వా రంగాన్ని రక్షించేందుకు చేసే ప్రయత్నాలను కూడా విమర్శలు చేయటం చంద్రబాబుకే చెల్లింది.
-అంతర్జాతీయంగా సంబంధం ఉన్న రంగం ఆక్వారంగం.అది ప్రస్తుతం స్ధంభించిపోయింది.అప్పటికప్పుడు శ్రీ వైయస్ జగన్ అన్ని శాఖలు,కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించగలిగారు.
ఆర్దిక సమస్యలు ఉన్నాముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు
ఈ ఆపద సమయంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించకముందే పేదలకు ఉచితంగా రేషన్ ఇప్పించారు.వేయిరూపాయలు ఆర్దికసహాయం అందించారు.
కష్టకాలంలో ప్రజలను వదిలేసి చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారు
క్లిష్టసమయంలో ప్రజాసంక్షేమాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలకు నిదర్శనం.
దేశంలో ఏటా 7 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్వా పంటలో నాలుగునుంచి నాలుగున్నర లక్షల మెట్రిక్ ట్నులు అంటే సగంపైగానే ఏపీ నుంచి ఉత్పత్తి వస్తోంది.
22 వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఏపినుంచే లభిస్తుంది.
-ప్రస్తుతం చైనాకు యుఎస్ కు ఎగుమతులు వెళ్తున్నాయి.ఎగుమతుదారులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.
స్పైసెస్ బోర్డులాగే ఆక్వా రంగానికి కూడా ప్రత్యేక అధారిటి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం
త్వరలో ఆక్వా అథారిటీ ఏర్పాటు చేస్తాం.
మిర్చి అరటి పసుపు పంటలు చేతికి వచ్చే సమయం ఇది.
అరటి, బొప్పాయిప్రభుత్వమే కొనుగోలు చేసి విక్రయిస్తోంది.రైతులను ఆదుకోవాలనేదే మా ప్రభుత్వం లక్ష్యం.
చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని ఏపీకి రావాలి.ఇక్కడకు వచ్చాక 14 రోజులు క్వారంటైన్ లోకి వెళ్లాలి.
ఆ తర్వాత జనంలోకి వస్తే వాస్తవాలు తెలుస్తాయి.