గూడూరు, ఏప్రిల్.12.(అంతిమ తీర్పు ).:
కరోనా మహమ్మారి వలన ప్రపంచ దేశాలు నాశనం అవుతు ,ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో హిందూ ధర్మ పరిరక్షణ జిల్లా కొ ఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఆదివారం గూడూరు పట్టణంలోనీ పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలో శ్రీ దుర్గాదేవి సన్నిధిలో కరోనా నివారణ, లోక రక్షణ కొరకు అమ్మ వారికి నవవరణ హోమం వేదపండితులతో కలిసి నిర్వహించారు, ఈ సందర్భంగా కోట సునీల్ కుమార్ స్వామి మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గ పీఠాధిపతులు వారి దివ్య ఆశీస్సులతో మరియు వారి ఆజ్ఞానుసారంగా కొరొనా నివారణకు మరియు లోక కల్యాణం కొరకు శ్రీ సాయి సత్సంగ నిలయంనందు అమ్మవారి నవావరణ హోమంతో పాటు ధన్వంతరి, ఔషధ చక్ర నారాయణ, దుర్గా త్రిశతి, యోగా వశిష్ట నందలి కర్కతోపాఖ్యానంలోని నారాయణ, నారాయణి బీజ సహిత విశేష హోమం నిర్వహించడం జరిగింది అన్నారు, ఈ కార్యక్రమంలో కోట ప్రకాశం స్వామి దంపతులు, కోట సునీల్ కుమార్ స్వామి దంపతులు, వేద పండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు,