ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో విజిటేబుల్ బిర్యాని పంపిణీ

ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో విజిటేబుల్ బిర్యాని పంపిణీ
విజయవాడ పశ్చిమ, ఏప్రిల్, 26 : (అంతిమ తీర్పు);          ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోన కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కునేందుకు పోలీసు, వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మీడియా కృషి కూడా అభినందనీయమని ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు బ్రహ్మయ్య అన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి, లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి నిరాశ్రయులైన వారికి, వలస కూలీలకు అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం విజయవాడ కమిటీ తరఫున వెజిటేబుల్ బిర్యాని ప్యాకెట్లను ఆదివారం స్థానిక భవానిపురం పోలీస్ స్టేషన్లో పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అన్నవరపు బ్రమ్మయ్య మాట్లాడుతూ మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువ జనాభా కలిగిన భారతదేశం ముందుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మరణాల శాతం తక్కువగా ఉందన్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. ఏపీజేఎఫ్  నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకటరమణ మాట్లాడుతూ కరోనా కోవిడ్ 19  మహమ్మారి వ్యాప్తి, దేశంలో నెలకొన్న పరిస్థితులు ప్రభావంతో ఎంతోమంది నిరాశ్రయులయ్యారనీ తినడానికి తిండి దొరక్క అల్లాడుతున్నారని  అటువంటి వారికి జర్నలిస్టుగా సామాజిక బాధ్యతతో ఆహార పొట్లాలను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం విజయవాడ కమిటీ తరఫున పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇంటిని, కుటుంభం  సభ్యులను  వదిలి రేయింబవళ్ళు విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో భవాని పురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ లు, రవీంద్ర బాబు, మూర్తి ,ఇస్రాయిల్ ,పోలీస్ సిబ్బంది, జర్నలిస్టు ఫోరం నాయకులు, తదితరులు పాల్గొన్నారు