వాలంటీర్స్ లేని వైఆర్ పల్లి

*వాలంటీర్స్ లేని వైఆర్ పల్లి
వరికుంటపాడు :
వరికుంటపాడు మండలం లోని ఎర్రం రెడ్డి పల్లి పంచాయతీ లో వాలంటీర్స్ లేకపోవడం గమనార్హం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా ఏర్పాటు చేసిన వాలంటీర్స్ వ్యవస్థ ఇక్కడ నోచుకోకపోవడం విశేషం. సుమారు 5  నెలల క్రితం వాలంటీర్స్ వ్యవస్థ ఏర్పడినప్పుడు ఎర్రం రెడ్డి పల్లి కి ముగ్గురు యువకులు ఎన్నికయ్యారు. కానీ ఉన్నత చదువులకోసం అని ఉద్యోగ అన్వేషణ లో నెల లోపే మానుకున్నారు, అప్పటి నుండి ఈ పంచాయతీ కి వాలంటీర్స్ లేకపోవడం గమనార్హం.ప్రభుత్వం ఏర్పాటు చేసే సంక్షేమ పథకాలును ప్రచారం చేయడం అందులో పాలు పంచుకోవడం వాలంటీర్స్ విధి. కానీ ఇక్కడ వాలంటీర్స్ లేకపోవడం తో పింఛను,  రేషన్ సరుకులు లాంటి  ఇంటింటికి పంపిణి కార్యక్రమాలు కి విఘాతం ఏర్పడుతుంది. ఈ విషయమై ఎంపీడీఓ సురేష్ కుమార్ ని వివరణ కోరగా ఉన్నత అధికారులకు నివేదిక పంపామని ఆదేశాలు రాగానే ఎంపిక చేస్తామన్నారు.