కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి వల్ల పేదలకు వచ్చే లాభం ఏంటి.. : ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు సుంకర పద్మశ్రీ
కార్మికులను, వలస కూలీలను , రైతులను పట్టించుకోకుండా... కేవలం పారిశ్రామిక వర్గాల పక్షంగా వ్యవహరించిన కేంద్రం
20 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో అర్థం కాక జుట్టు పీక్కుంటున్న పేదలు...
2014 నుండి అంధ్రప్రదేశ్ కు ఒక లక్ష కోట్లు ఇచ్చాము అని ఏవో కాకి లెక్కలు చూపించినట్లుగానే ఉండబోతుందా ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజి ??
కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ సామాన్యుడికి ఉపయోగం లేదని విమర్శించిన కాంగ్రెస్ నేత పద్మశ్రీ.
మరో సారి సూటు - బూటు సర్కారు అని రుజువు చేసుకున్న మోడీ ప్రభుత్వం... కాంగ్రెస్ నేత ఘాటు విమర్శ.
మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి ఇది ప్రజా ప్రభుత్వం కాదని నిరూపించారు..
కరోనా నుంచి దేశాన్ని కాపాడాల్సిన కేంద్రం.. ప్రజల జీవితాలు గాలికి వదిలేసింది.
ఆర్థిక పరిపుష్టి పెంచే చర్యల పేరుతో... పేదల కడుపుకొడుతోంది.
వలస కూలీల పైన కరుణించని.. మోడి సంస్కరణల పేరుతో ఉన్న ఉపాధి పోగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన పద్మశ్రీ.
దేశంలో వలస కూలీలు సొంత గ్రామాలకు, స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతుంటే.. వారికి సౌకర్యాలు కల్పించకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించిన కాంగ్రెస్ నేత.
యతారాజ... తథా సీఎం అన్నట్లుగా రాష్ట్రంలో జగన్ పాలన.
వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను తీసుకురావడం... రాష్ట్రంలో ఉన్న వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపడం చేతకాదు... విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావాలని లేఖలు రాస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయిన జగన్... వలస కూలీలను ఆకలితో చంపుతున్నారు.
ప్రచారం ఎక్కువ.. పని తక్కువ లో జగన్, ఆయన అనుయాయులను మించిన వారు లేరని నిరూపించారు.
ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు సుంకర పద్మశ్రీ