ఉదయగిరి. పవిత్ర రంజాన్ నెలలో లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద ముస్లిం కుటుంబాలకు ఉదయగిరి కి చెందిన ఉపాధ్యాయులు షేక్ దస్తగిరి అహమ్మద్, ఆయన సోదరుడు జాఫర్ అహ్మద్ గురువారం నగదు అందజేశారు. తన తండ్రి స్టాంపుల గౌస్ మొహియుద్దీన్ స్ఫూర్తితో ఈ కార్యక్రమం తలపెట్టని 20 వేల రూపాయలు నగదును పేదలకు పంచి పెట్టామని అన్నారు. ఉదయగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 50 వేల రూపాయలతో స్టేజీ నిర్మాణం చేయించి ఇచ్చామని, మండల విద్యా వనరుల కేంద్రం లో అవసరాల కోసం ఒక బీరువా కొనుగోలు చేసి అందించామని, అలాగే నాగుల బావి సెంటర్ లోని ప్రభుత్వ పాఠశాలలో పదివేల రూపాయలతో బ్లాక్ బోర్డు నిర్మాణం చేశామని ఇదే స్ఫూర్తితో ఈ ప్రాంతంలోని దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని వారు కోరారు.
ఆర్థిక సహాయం