భార్యను కాపురానికి పంపలేదని అత్తను దారుణంగా హతమార్చిన అల్లుడు .

భార్యను కాపురానికి పంపలేదని అత్తను దారుణంగా హతమార్చిన అల్లుడు ......


.ఏఎస్ పేట మండలం చౌటభీమవరం గ్రామానికి చెందిన మేకల పోలమ్మ 65ను అల్లుడు సోలా తిరుపాలు దారుణంగా హత్య చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది వివరాల్లోకి వెళితే చవట భీమవరం గ్రామానికి చెందిన మేకలబోయిన పోలమ్మకు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు కుమార్తె దొరసానమ్మకు మండలంలోని దూబగుంట గ్రామానికి చెందిన సోలా తిరుపాలు తో కొద్ది సంవత్సరాల క్రితం  వివాహమయ్యింది అప్పటి నుండి తరచూ ఏదో ఒక సమస్యపై గొడవ పడుతూ భార్యను తాగి వేధిస్తుండటంతో  భర్త వేధింపులు తాళలేక భార్య దొర్సానమ్మ తల్లి పోలమ్మ వద్ద ఉంటుంది అయితే అల్లుడు పోలయ్య అత్తను తరచూ భార్యకు కాపురానికి పంపాలని  చెప్తూ ఉండేవాడు అత్త తనభార్యను కాపురానికి పంప లేదన్న కోపంతో బుధవారం ఉదయం పోలయ్య అత్త ఇంటి ముందు కాపు కాసి అత్త పోలమ్మ నీళ్ల కోసం బయటికి రావడంతో ఒక్కసారిగా కత్తితో నరకడంతో పోలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది సమాచారం  తెలుసుకున్న ఆత్మకూరు సిఐ పాపారావు "పేట" ఎస్ఐ గోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు పారిపోతున్న నిందితుడు పోలయ్యను పోలీసులు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు  ఈ సందర్భంగా ఆత్మకూరు సిఐ పాపారావు విలేఖరులతో మాట్లాడుతూ కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు అత్తను కత్తితో దాడి చేయడంతో పోలమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు