ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లకు కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ చేయూత

ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లకు కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ చేయూత


వింజమూరు, మే 8 (రిపోర్టర్- దయాకర్ రెడ్డి): వింజమూరులోని వాటర్ ట్యాంక్ బస్టాండు వద్ద శుక్రవారం సాయంత్రం కే.జి.ఆర్.వి.యస్ (కొండా.గరుడయ్య, కొండా.రామచంద్రయ్య, కొండా.వెంకటసుబ్బయ్య)ల చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లకు కూరగాయలు, వంట సరుకులు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో వింజమూరు మండలంలో కొండా వారి కుటుంబ సభ్యుల నేతృత్వంలో నడుస్తున్న కే.జి.ఆర్.వి.యస్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. గత 50 రోజులుగా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఆదుకునేందుకు వేలాది రూపాయల నిధులను ఖర్చు చేస్తూ కొండా వారి కుటుంబీకులు తమ దాతృత్వమును చాటుకుంటుండటం గొప్ప విషయమన్నారు. దాతృత్వానికి ఎల్లప్పుడూ దైవానుగ్రహం తప్పనిసరిగా ఉంటుందని ఆకాం క్షించారు. కొండా వారి కుటుంబం ఇప్పటివరకు ఆపదలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు, పేద విధ్యార్ధులకు స్కాలర్ షిప్ లు, వికలాంగులకు ట్రై సైకిళ్ళు, కార్యాలయాలకు బెంచీలు వితరణ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించి ధర్మ దాతలుగా నిలిచారన్నారు. తాజాగా కరోనా వైరస్ నియంత్రణకు గానూ ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ లో సైతం పేదలకు సేవలు అందిస్తుండటం లాంటి మహోన్నత సేవలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అంశాలుగా తహసిల్ధారు సుధాకర్ రావు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ ప్రతినిధులు కొండా.బాలసుబ్రహ్మణ్యం, కొండా.వెంకటేశ్వర్లు, కొండా.చిన సుబ్బరాయుడు, కొండా.పెద సుబ్బరాయుడు, కొండా.వెంకటేశ్వర్లు, కొండా.సుమన్ లతో పాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు చవల.వెంకటసత్యనారాయణ, గంగిశెట్టి.హజరత్, దుగ్గి.మధు,  గంగిశెట్టి.సుధాకర్, కటకం.ప్రసన్న కుమార్, చీతిరాల.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.