ఏపీలో మొత్తం 1,04,060 కరోనా టెస్టులు : జవహర్‌రెడ్డి

*ఏపీలో మొత్తం 1,04,060 కరోనా టెస్టులు చేశాం:*       *జవహర్‌రెడ్డి*


అమరావతి : ఏపీలో మొత్తం 1,04,060 కరోనా టెస్టులు చేశామని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఏపీలో కరోనా కేసుల పాజిటివ్‌ రేటు 1.43శాతం ఉందని చెప్పారు. ఏపీలో 1,463 కరోనా పాజిటివ్‌ కేసులున్నాయని 403 మంది డిశ్చార్జ్‌ చేశామని ప్రకటించారు. ఏపీలో రికవరీ రేటు 27.55శాతం ఉందని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 9 ల్యాబ్‌లలో కరోనా టెస్టులు చేస్తున్నామని, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో మరో రెండు ల్యాబ్‌ల ఏర్పాటుకు అనుమతిచ్చామని తెలిపారు. శ్రీకాకుళం, ప్రకాశంలో ట్రయల్ టెస్టులు మొదలయ్యాయని, నెల్లూరులో ల్యాబ్‌ ఏర్పాటు పూర్తయిందని జవహర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, ఒక్కో ల్యాబ్‌లో 250 కరోనా పరీక్షలు చేయొచ్చని జవహర్‌రెడ్డి వివరించారు.