వ్యవసాయ మౌళిక సదుపాయాలకు రూ. 1 లక్ష కోట్లు: గుంటూరు బీ జె పీ జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు.

                     Date: 15/05/2020
కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్లతో  ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పధకం  అద్భుతం
వ్యవసాయ మౌళిక సదుపాయాలకు రూ. 1 లక్ష కోట్లు: – బీ జె పీ జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు.


గుంటూరు: కరోనా వైరస్ దెబ్బకు కుదేలైపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి దారిలో పెట్టేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్లతో  ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పధకం  ప్రవేశ పెట్టిందని, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారెని దేశ ప్రజలు ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారని, ఇలాంటి దేశ ప్రజల అభివృధి కోసం ఎన్నో పధకాలు ప్రవేశ పెట్టి, అభివృద్ధి చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. మూడో విడతలో  ప్రకటించిన ప్యాకేజి లో భాగంగా శుక్రవారం మరిన్ని వరాలను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారని బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు తెలియజేశారు. 
తొలి విడతలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.5.94 లక్షల కోట్ల విలువైన 16 అంశాలను తెలియజేశారని, రెండో దశలో వలస కూలీలు, చిన్న రైతుల కోసం తొమ్మిది అంశాలతో కూడిన రూ.3.16 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీ వివరాలను తెలియజేశారు. మూడో రోజైన శుక్రవారం.. వ్యవసాయం, దానికి అనుబంధంగా కొనసాగే పాడి, మత్య్స, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై అద్భుతమైన ప్యాకేజిని ప్రకటించారని, దేశంలో సప్లై చైన్ ఎలా ఉండాలో, దానికి టెక్నాలజీని ఎలా జోడించాలో ప్రధాని మోదీ తన సందేశంలో తెలియజేశారని, ఈ రంగంలో మొత్తం 11 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని, పంటలు చేతికొచ్చిన ఈ కీలక దశలోనే లాక్ డౌన్ కొనసాగినప్పటికీ, గడిచిన రెండు నెలల్లో రైతులకు కనీస మద్దతు ధరగా కేంద్రం రూ.74, 300కోట్లు చెల్లించిందని, గడిచిన రెండు నెలల కాలంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన(పీఎం కిసాస్) పథకం కింద దేశంలోని పేద రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.18,700 కోట్లు జమ చేశారని వై.వి. సుబ్బారావు తెలియజేశారు.  అలాగే, పీఎం ఫసల్ బీమా యోజన కింద గత రెండు నెలల్లోనే రూ.6,400 కోట్లు విడుదల చేశారాని,
పాడి పరిశ్రమకు రూ.5వేల కోట్లు, పలు కారణాల వల్ల పాల సేకరణ రంగం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉందని, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా ఆ రంగాన్ని ఆదుకునేందుకు రూ.4,100 రూపాయలు వెచ్చించి, మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించారాణి వై.వి. సుబ్బారావు తెలియజేశారు. 2020-21 సంవత్సరానికిగానూ పాడి సహకార సంస్థల కోసం రూ.5వేల కోట్ల లిక్విడిటీని అన్ లాక్ చేసారని, తద్వారా 2కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వై.వి. సుబ్బారావు తెలియజేశారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయల కల్పన కోసం రూ.1లక్ష కోట్లు కేటాయించారని, దీని ద్వారా ఈ రంగంలో కీలక భూమిక పోషించే ప్రాథమిక సహకార సంఘాలు, రైతు సంఘాలు, అగ్రికల్చర్ స్టార్టప్ లకు లబ్ధి చేకూరుతుందని, అలాగే, ఫుడ్ సెక్టార్ లో సూక్ష్మ పరిశ్రమకుల రూ.10 వేల కోట్లు ప్రకటించారని,  ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో భాగంగా మత్య రంగానికి రూ.20 వేల కోట్లు కేటాయించారని, ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలోనే మత్య సంపద యోజన పేరుతో కొత్త పథకం ప్రకటించారాణి, మన దేశంలో సుమారు 55 లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని, వాళ్లందరికీ వ్యక్తిగత బోట్లు అందించడంతోపాటు బీమా సౌకర్యం కూడా కల్పిస్తారని మొత్తంగా రాబోయే ఐదేళ్లలో ఇప్పుడున్న దానికంటే 70 లక్షల టన్నులు అధికంగా మత్స్య ఉత్పత్తి సాధిస్తామనే నమ్మకముందని వై.వి. సుబ్బారావు తెలియజేశారు.