104 సిబ్బంది నిరసన

104 సిబ్బంది నిరసన
 ఉదయగిరి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో 104 సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టామని 104 వాహనాలను మరమ్మతులు చేయాలని, తమ వేతనాలు పెంచాలని, కోవిడ్-19 ఈ పరిస్థితుల్లో పనిచేస్తున్న తమ సిబ్బందికి రక్షణ సామాగ్రి తక్షణం పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ముజీబ్, రాఖీ, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.