రేపు అనగా 16.05.2020 నుండి 4 విడత రేషన్ పంపిణీ జరుగుచున్నది : తహశీల్దారు వింజమూరు

 


                            శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వింజమూరు: మే 15 (అంతిమ తీర్పు) :                 మండలంలోని యావన్మంది ప్రజలకు తెలియచేయడమైనది ఏమనగా రేపు అనగా 16.05.2020 నుండి 4 విడత రేషన్ పంపిణీ జరుగుచున్నది. ఈ 4 విడత రేషన్ పంపిణీ పధకము క్రింద AAY కార్డుదారులకు కార్డు ఒక్కింటికి 35Kgల బియ్యము, 1kg శెనగలు ఉచితముగా ను మరియు 1kg చక్కెర రూ.13.50 పై.లకు పంపిణీ చేయుదురు. అన్న పూర్ణ కార్డు దారులకు కార్డు ఒక్కింటికి  10 kg బియ్యము, 1kg శెనగలు ఉచితముగా మరియు ½ kg చక్కెర రూ.10 లకు  మరియు BPL కార్డుదారులకు కార్డు యందలి ఒకొక్క సభ్యునికి 5 కేజీల బియ్యము, కార్డు ఒక్కింటికి 1kg శెనగలు ఉచితముగా మరియు ½ kg చక్కెర రూ.10 లకు  యివ్వబడును. కావున కార్డు దారులు అందరు రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించి రేషన్ సరుకులు తీసుకొన వలసినదిగా తెలియచేయడ మైనది. 


తహశీల్దారు
వింజమూరు