కోవిడ్-19 విధుల్లో వ్యాయామ ఉపాధ్యాయులు

*కోవిడ్-19 విధుల్లో వ్యాయామ ఉపాధ్యాయులు


వింజమూరు, మే 12 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పి.ఇ.టి మాస్టర్లు సైతం గత నెల రోజ నుండి విధులలో మునిగితేలుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ లాక్ డౌన్ సమయంలో సెలవులు ప్రకటించి ఉన్నారు. విధ్యార్ధులు పలు చోట్ల మైదానాలలో జట్లుగా ఏర్పడి క్రికెట్, వాలీబాల్, బ్యాట్మింటన్ తదితర క్రీడలను నిర్వహిస్తుంటారు. క్రీడలు అవసరమైనప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఇద్దరికి మించి ఒకే చోట ఉండరాదనే నిబంధనలున్నాయి. ఈ ఉపాధ్యాయులు ప్రతిచోటా మైదానాలలో విచ్చలవిడిగా నిర్వహించే క్రీడలను అరికట్టడంతో పాటు ఉదయం వేళల్లో బంగ్లాసెంటర్ వద్ద వాహనాల రద్దీని కూడా నియంత్రిస్తూ వాహనదారులకు పలు సూచనలిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్-19 విధుల్లో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, పారిశుద్ద్య్హ కార్మికులు, ఆశా వర్కర్లు, ఏ.యన్.యం లు తదితర విభాగాలతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు కూడా భాగస్వాములు కావడం పట్ల పలువురు ఉపాధ్యాయులు మాకు కూడా సేవలు అందించే భాగ్యం కలిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వింజమూరులో ప్రతిరోజూ మండాది.తిరిపాలురెడ్డి, వెలుగోటి.క్రిష్ణ, నలగందు.ప్రభాకర్ రెడ్డిలు కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా తమ వంతుగా విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.