కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష

06–05–2020
అమరావతి


కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష


అమరావతి: వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీకి చెందిన వలస కూలీలు, అలాగే రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వలసకూలీలల తరలింపు విధానాలపై చర్చ
విదేశాలనుంచి, వివిధ రాష్ట్రాలనుంచి దాదాపు 1.5లక్షల మంది వచ్చే అవకాశాలున్నాయని తెలిపిన అధికారులు


విదేశాలనుంచి వచ్చేవారు ఆమూడు ఎయిర్‌పోర్టులకు:


విదేశాల నుంచి విమానాల్లో వచ్చేవారు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు చేరుకుంటారని తెలిపిన అధికారులు
వారికి అక్కడే మెడికల్‌ స్క్రీనింగ్‌ చేయిస్తామన్న అధికారులు
మార్గదర్శకాల ప్రకారం వారిని క్వారంటైన్‌ చేసి పర్యవేక్షణ చేస్తామని వెల్లడి
ఆతర్వాతే వారిని స్వస్థలాలకు పంపిస్తామన్న అధికారులు
విదేశాలనుంచి వస్తున్న వారిలో ఆయా దేశాల్లో కరోనా తీవ్రత ఆధారంగా వారిని వర్గీకరిస్తున్నామన్న అధికారులు
అలాగే గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న వారికి కూడా క్వారంటైన్‌ సదుపాయాలపై దృష్టిపెట్టాలన్న ముఖ్యమంత్రి
మహారాష్ట్రలోని థానే నుంచి 1000 మందికిపైగా వలసకూలీలు గుంతకల్‌ వచ్చారని తెలిపిన అధికారులు
వీరందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు
థానేలో కేసుల తీవ్రత అధికంగా ఉందని, వీరిని పర్యవేక్షించాల్సి ఉందని తెలిపిన అధికారులు
సరిహద్దుల్లో 9  చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు
పోలీసులు, వైద్య బృందాలు సమన్వయం చేసుకుంటాయన్న అధికారులు


వలసకూలీల విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు స్పష్టంచేసిన సీఎం
ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్‌ ఏర్పాటుచేసి వారికి భోజనం, తదితర సదుపాయాలు ఇవ్వండి:
వివిధ పరిశ్రమల్లో పనులకు వెళ్తానంటే.. వారికి సహకారం అందించండి:
తమ తమ రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే... వారికి కావాల్సిన ప్రయాణ ఏర్పాటు చేయండి:
దీనికి అవసరమైన ఖర్చను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.., ఈవిషయంలో సంకోచించాల్సిన అవసరంలేదు: సీఎం
చొరవ తీసుకుని వారికి తగిన విధంగా సహాయం చేయండి:
వెళ్లేటప్పుడు దారి ఖర్చుల కింద రూ.500లు రూపాయలు ఒక్కో కూలీకి ఇవ్వండి:


అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన కూలీలు ఇక్కడకు వచ్చేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ముందుకురాని పరిస్థితులు ఉంటే.. వెనకడుగు వేయవద్దు:
అవసరమైన పక్షంలో వారికీ ప్రయాణ సదుపాయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలి: సీఎం
మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్నవారి ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశం:


డిశ్చార్జి కేసుకు సంబంధించి పటిష్టమైన ప్రోటోకాల్‌ పాటిస్తున్నామని అధికారులు వెల్లడి
వరుసగా రెండు పరీక్షల్లో నెగెటివ్‌ వస్తేనే డిశ్చార్జి చేస్తున్నామని వెల్లడి
కోవిడ్‌ – కేసుల డిశ్చార్జిలో దేశ సగటు 28.63  శాతం అయితే రాష్ట్రంలో 41.02 శాతం అలాగే పాజిటివిటీ రేటు కూడా రాష్ట్రంలో 1.26 శాతం అయితే దేశంలో 3.87 శాతం ఉందని వెల్లడించిన అధికారులు 


టెలిమెడిసిన్‌లో భాగంగా సబ్‌ సెంటర్లకు మందులు పంపించి... డాక్టర్ల ఇచ్చిన ప్రిస్కిప్షన్‌మేరకు వారికి  పంపిణీచేస్తున్నామని తెలిపిన అధికారులు 


వ్యవసాయం అను బంధ రంగాలు :


రైతులకు అండగా నిలిచేందుకు తగినంతమేర సేకరణ చేయాలన  సీఎం
ఎక్కడ రైతులు సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే స్పందించాలన్న సీఎం
ఈ విషయంలో అ«ధికారులు అగ్రెసివ్‌గా ఉండాలని మరోమారు స్పష్టంచేసిన ముఖ్యమంత్రి


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image