కొవిడ్-19 పై ఆదివారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం

అమరావతి, మే 3(అంతిమ తీర్పు) : కొవిడ్-19 పై ఆదివారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.


ఈసందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా  రెడ్, ఆరెంజ్ జిల్లాల్లో లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే అంశంపై విదేశీ వ్యవహారాలు, హోం శాఖల అధికారులు రాష్ట్రాలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఇంకా వివిధ అంశాలను వీడియో సమావేశంలో ఆయన చర్చించారు.


వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్,కొవిడ్ కంట్రోల్ రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ మరియు ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్, పరిశ్రమల శాఖ కమీషనర్ సుబ్రహ్మణ్యం, ఐజి వినీత్ బ్రిజ్లాల్ తదితరులు.