కాకినాడ మడ అడవులను నరికేసి, పూడ్చి పాతరేస్తున్నట్టే నిబంధనలన్నిటినీ పాతరేస్తారు :నారా లోకేష్

 టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...


పర్యావరణ పరిరక్షణ చట్టాలు, అటవీ పరిరక్షణ చట్టాలు, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు... ఇలా ఎన్ని చట్టాలు చేసుకుంటే ఏంటి? చట్టాలను అతిక్రమించి నేరాలు చేసే వాళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు, ఇదిగో ఈ ఫొటోల్లో కాకినాడ మడ అడవులను నరికేసి, పూడ్చి పాతరేస్తున్నట్టే నిబంధనలన్నిటినీ పాతరేస్తారు


పేదల కోసం ఇళ్ళ స్థలాలు సేకరించడం చేతకానోళ్లు... ఇలా పర్యావరణాన్ని నాశనం చేసి ఒక వైపు మత్స్యకారులకు జీవనాధారం లేకుండా చేస్తున్నారు. మరో వైపు కాకినాడకు తుఫాను ముప్పును తెచ్చి పెడుతున్నారు. ఇంకోవైపు భావితరాలకు కాలుష్య వాతావరణాన్ని మిగుల్చుతున్నారు