మంత్రులకు పర్యవేక్షణ బాధ్యత

మంత్రులకు పర్యవేక్షణ బాధ్యత


విశాఖపట్నం: స్టైరీస్ గ్యాస్ బాధిత ప్రజలకు సహాయక చర్యల పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబుకు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిం చారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్ లను  స్థానికంగా అందుబాటులో ఉండాలని చెప్పారు. 


డిప్యూటీ సీఎం సమీక్ష :
 ఎల్జి పాలిమర్స్ ఘటనకు సంబం ధించి తాజా పరిణామాలపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ లతో కలసి విశాఖ సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో చర్చించారు. గత రాత్రి మరోసారి గ్యాస్ లీక్ అయిందన్న  అంశంపై ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. గుజరాత్ నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. సహాయక చర్యల పై ఈరోజు అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించారు. కేజీహెచ్ తో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని మరో  కలుసుకొని వారికి అందుతున్న వైద్యసేవలు గురించి అడిగి తెలుసుకోనున్నారు.