13–05–2020
అమరావతి
రాష్ట్రంలో 2 లక్షలు దాటిన కోవిడ్ –19 పరీక్షల సంఖ్య
2,01,196 పరీక్షలు చేసిన వైద్య ఆరోగ్య శాఖ
నిన్న ఒక్క రోజే 9,284 పరీక్షలు
ప్రతి మిలియన్‌కు 3,768 పరీక్షలు
రికవరీ అయిన వారి సంఖ్య 1142, యాక్టివ్ కేసులు 948
గడచిన 24 గంటల్లో 86 మంది డిశ్చార్జి
కొత్తగా నమోదైన 48 కేసుల్లో 36 పాత క్లస్టర్లనుంచే..
కొత్త పాజిటివ్ కేసుల కంటే పెరుగుతున్న డిశ్చార్జీల సంఖ్య
అమరావతి:
కోవిడ్ –19 నివారణా చర్యలపై సీఎం వైయస్.జగన్ సమీక్ష
డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరు:
రాష్ట్రంలో పాజిటివిటీ కేసులు 1.06 శాతం, దేశంలో 4.01 శాతం
రాష్ట్రంలో మరణాల రేటు 2.20 శాతం, దేశంలో 3.25 శాతం
రికవరీ రేటు రాష్ట్రంలో 53.44 శాతం, దేశంలో 32.90 శాతం
ఏ లోటూ లేకుండా ఎమర్జెన్సీ సేవలు:
సీఎం ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ సేవలను గుర్తించామన్న అధికారులు
గర్భిణీలు, కీమోథెరఫీ, డయాలసిస్ వంటి ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారందర్నీ గుర్తించామన్న అధికారులు
షెడ్యూలు ప్రకారం వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్న అధికారులు
షెడ్యూలు సమయానికి వైద్య సిబ్బందే కాల్ చేసి వైద్య సేవల కోసం వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారన్న అధికారులు
క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది అన్ని రకాలుగా వారికి అండగా ఉంటున్నారన్న అధికారులు
పక్కాగా ఆరోగ్య ఆసరా:
అలాగే ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలన్న సీఎం
ఇది ఈ ప్రభుత్వంలో కొత్తగా పెట్టిన కార్యక్రమమని, అమల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూడాలన్న సీఎం
సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు:
గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించామని వెల్లడి.
ప్రతి మూడు వారాలకు బిల్లులు అప్‌లోడ్ కావాలని, ఆ తర్వాత వాటిని వెంటనే మంజూరు చేయాలన్న సీఎం
ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్న సీఎం
జూలై 1న 108 సర్వీసులు 1060 ప్రారంభం:
108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1060 వాహనాలను జూలైæ 1న ప్రారంభించాలని నిర్ణయం
అలాగే టెలి మెడిసిన్ కోసం కొత్త బైకులను కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం
చేపలు, రొయ్యలకు స్థానికంగా మార్కెటింగ్:
చేపలు, రొయ్యల అమ్మకాలు
రాష్ట్రంలో స్థానికంగా విక్రయించేలా చూడాలి
దీని కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి
కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలి
దీనిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
అలాగే రైతులు పండించిన ఇతర ఉత్పత్తులు కూడా కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలి
చేపలకు ధర, మార్కెటింగ్ విషయాల్లో చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవికి సీఎం ఆదేశం
ట్రేడర్లతో మాట్లాడాలని సీఎం ఆదేశం
అలాగే ట్రేడర్లకు అవసరమైన మార్కెటింగ్ ఇతర రాష్ట్రాల్లో లభించేలా తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎస్‌కు సీఎం ఆదేశం.
పండ్ల ఉత్పత్తులు:
రాయలసీమ తదితర జిల్లాలలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమోటాలకు మరింత మార్కెట్.
కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం.