*09–05–2020*
*అమరావతి*
*అమరావతి:*
*కోవిడ్ –19పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
*వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.ఎస్.జవహర్ రెడ్డి సహా.. పలువురు అధికారులు హాజరు*
*కోవిడ్ పరీక్షల్లో ప్రథమ స్థానం:*
ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక పరీక్షలతో దేశంలో ప్రధమ స్థానంలో కొనసాగుతున్న ఏపీ.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,65,069 పరీక్షలు.
నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 8388 పరీక్షలు
రాష్ట్రంలో ప్రతి మిలియన్‌కు 3091 పరీక్షలు. తమిళనాడులో 2799 పరీక్షలు. రాజస్థాన్‌లో 1942 పరీక్షలు.
పాజిటివిటీ రేటు రాష్ట్రంలో 1.17 కాగా, దేశంలో 3.92 «శాతం
మరణాల రేటు ఏపీలో 2.28 ఉండగా, దేశంలో 3.3 శాతం
*డిశ్చార్జీలు పెరుగుతున్నాయి:*
రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల కన్నా.. డిశ్చార్జీల సంఖ్య పెరుగుతోంది: అధికారులు
నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 43 కేసులు నమోదైతే 45 మంది డిశ్చార్జ్ అయ్యారు.
నిన్న నమోదైన కేసులలో 31 కేసులు పాత క్లస్టర్ల నుంచే వచ్చాయి.
చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లిన రైతులతో పాటు, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిన వారి మీద దృష్టి పెట్టాం: అధికారులు
కోయంబేడు మార్కెట్ వల్ల చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో కేసులు పెరుగుతున్నాయి: అధికారులు
రాష్ట్రానికి తిరిగి వస్తున్న వలస కార్మికులపై దృష్టి: అధికారులు
కంటైన్‌మెంట్ క్లస్టర్లలో ఉంటున్న వారికి ఎక్కువగా పరీక్షలు చేస్తున్నాం: అధికారులు
వైరస్ వ్యాప్తి దాదాపుగా కంటైన్‌మెంట్ క్లస్టర్లకే పరిమితం చేయగలుగుతున్నాం: అధికారులు
ఇది ఒక మంచి పరిణామం అన్న అ«ధికారులు.
*మంచి వైద్యంపై దృష్టి పెట్టండి: సీఎం*
కోవిడ్ వల్ల మరణాలు లేకుండా మంచి వైద్యాన్ని అందించడంపై దృష్టి పెట్టాలన్న సీఎం
రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారే రాష్ట్రంలో మరణిస్తున్నారన్న అధికారులు
కోవిడ్ అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇస్తే ఈ ముప్పు తప్పుతుందన్న అధికారులు
దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న అధికారులు
*కూలీల రాక:*
700 మంది కూలీలు ఎలాంటి అనుమతులు, పరీక్షలు లేకుండానే రాష్ట్రంలోకి ప్రవేశించారన్న అధికారులు
స్థానిక అధికారుల సహాయంతో వారి వివరాలు కనుక్కొని పరీక్షలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్న అధికారులు
ఐసోలేషన్ ప్రక్రియను మొదలుపెట్టామన్న అ«ధికారులు
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో వైరస్ ముప్పు పొంచి ఉందన్న అధికారులు
వారిపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామన్న అధికారులు
*టెలి మెడిసిన్:*
టెలి మెడిసిన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం
ద్విచక్ర వాహనాల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నాం
ఇప్పుడు దాదాపు 500 కాల్స్ మాత్రమే పెండింగులో ఉన్నాయి.
రోగులు కాల్ చేసిన 24 గంటల్లోగా వారికి ఔషథాలు అందించేలా చూస్తాం.
*సరిహద్దుల్లో వైద్య పరీక్షలు:*
సరిహద్దుల్లోని 11 చెక్ పోస్టుల వద్ద వైద్య పరీక్షల ఏర్పాట్లు.
వైద్యులు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు.
సరిహద్దులు దాటి వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ ప్రాథమిక పరీక్షలు చేస్తున్నామన్న అధికారులు
*ఆక్వా:*
ఆక్వా ఫీడ్ రేటు పెరగడంపై సీఎం ఆరా
తగిన చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి
రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
*విశాఖలో వెటర్నరీ సేవలు:*
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయిన ప్రాంతాల్లో పశువులకు చికిత్స చేస్తున్నామని సీఎంకు తెలిపిన అధికారులు.
13 వెటర్నరీ బృందాలు పని చేస్తున్నాయని, పశువులకు సెలైన్ ఎక్కించడంతో పాటు, అవసరమైన వైద్య సేవలందిస్తున్నాయని అధికారుల వెల్లడి.