రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు 2 శాతం, దేశంలో 3.27 శాతం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

*04–05–2020*
*అమరావతి*


*కోవిడ్‌–19  నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


*అమరావతి:*
*కోవిడ్‌–19  నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*
వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ హాజరు


రాష్ట్రంలో కోవిడ్‌ –19 పరీక్షల్లో కొనసాగుతున్న వేగం
ప్రతి పది లక్షల జనాభాకు 2,345 పరీక్షలు
కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో 2,224 పరీక్షలు
తమిళనాడులో ప్రతి మిలియన్‌కూ 1929 పరీక్షలు
రాజస్థాన్లో ప్రతి మిలియన్‌కూ 1402 పరీక్షలు
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 10,292 పరీక్షలు
నిన్నటి వరకూ 1,25,229 పరీక్షలు చేసిన ఏపీ 
24 గంటల్లో  67 పాజిటివ్‌ కేసులు నమోదు, యాక్టివ్‌ కేసులు 1,093,
524 మంది డిశ్చార్జి, మొత్తంగా 1,650 కేసులు, 33 మంది మృతి
రాష్ట్రంలో పాటిజివిటీ కేసుల శాతం 1.32 కాగా, దేశంలో 3.84 శాతం
రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు 2 శాతం, దేశంలో 3.27 శాతం


రాష్ట్రంలో పనిచేస్తున్న ల్యాబులు  11
పీరియాడికల్‌గా 3 ల్యాబుల్లో ఫ్యుమిగేషన్‌ చేస్తున్న అధికారులు
45 కేంద్రాల్లో 345 ట్రూనాట్‌మిషన్లు కూడా పనిచేస్తున్నాయి
గతంలో 245 ఉండేవి, మరో వంద పెంచారు
11 ఆర్టీపీసీఆర్‌ ల్యాబుల్లో 22 మెషిన్లు పనిచేస్తున్నాయి
ప్రతి జిల్లాలో కూడా 4 మెషిన్లు ఉంచాలన్నది ప్రభుత్వం ప్రయత్నం
రోజువారీ పరీక్షల సామర్థ్యం 6 వేలనుంచి 10వేలకుపైగా పెరిగింది
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 10,292 పరీక్షలు


కుటంబ సర్వేలో గుర్తించిన 32,792 మందికి రేపటిలోగా టెస్టులు పూర్తిచేస్తామన్న అధికారులు
రెడ్‌జోన్లలో ఉన్న ఆస్పత్రుల్లో కచ్చితమైన మెడికల్‌ ప్రోటోకాల్‌ పాటించాలని సీఎం ఆదేశం


రాష్ట్రంలో వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు – 65
యాక్టివ్‌ క్లస్టర్లు 86
డార్మింటరీ క్లస్టర్లు 46
గత 28 రోజులుగా కేసుల్లేని క్లస్టర్లు 50


*టెలిమెడిసిన్‌పై సీఎం*


టెలిమెడిసిన్‌ వ్యవస్థ బలోపేతం కావాలన్న సీఎం
కీలకమైన కాల్‌ సెంటర్ల నంబర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలన్న ముఖ్యమంత్రి
దిశ, టెలిమెడిసిన్, అవినీతి నిరోధానికి సంబంధించిన ఏసీబీ, వ్యవసాయం తదితర కీలక నంబర్లను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాలకు అందుబాటులో ఉంచాలన్న సీఎం


*వలసకూలీలు, యాత్రికులు, విద్యార్ధుల అంశంపై సీఎం*


వలసకూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులు, గ్రూపులకే అనుమతి ఇస్తామని మరోమారు స్పష్టంచేసిన ప్రభుత్వం
వెబ్‌సైట్‌ ద్వారా అప్లైచేసుకున్న వారిని పరిశీలించిన తర్వాత ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారికి అవకాశం కల్పిస్తాం
కేంద్ర హోంశాఖమార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి
వచ్చే వాళ్లు ఎక్కడనుంచి వస్తున్నారు, ఆయారాష్ట్రాల్లో వాళ్లు గ్రీన్‌జోన్లో ఉన్నారా? ఆరెంజ్‌ జోన్లో ఉన్నారా? రెడ్‌ జోన్లో ఉన్నారా? అన్న వివరాలు కూడా సేకరిస్తున్నామన్న అధికారులు
వీటిని నిర్ధారించుకుని వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకు అనుమతులు మంజూరుచేస్తామన్న అధికారులు
స్పందన వెబ్‌సైట్‌ ద్వారానే కాక వివిధ మార్గాలద్వారా విజ్ఞప్తులు చేసుకున్నవారు కూడా ఉన్నారన్న అ«ధికారులు.
వ్యక్తిగతంగా వచ్చే వారికి అనుమతి లేదన్న అధికారులు 


ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో క్వారంటైన్‌ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వారీగా సదుపాయాలు ఉండాలని చెప్పాం.. దీన్ని ఎలా బలోపేతం చేయాలి అన్న దానిపై దృష్టి పెట్టాలన్న సీఎం
అలాగే వచ్చే వారికి, వారికి చేయాల్సిన పరీక్షల విధానంపైకూడా మార్గదర్శకాలు తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం


*తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి:*


ఎంఫాన్‌ తుపాను ఏపీ వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలి:
తుపాను కదలికల్ని గమనించాలి:
విద్యుత్తు, రెవిన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ సన్నద్ధంగా ఉండాలి:
ఆస్తినష్టం, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి:
వేట నిషేధ సమయమే అయినా బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలి:
కొంతమంది అధికారులను సిద్ధంచేసుకోవాలి: 
అలాగే కార్యాచరణ కూడా సిద్ధంచేసుకోవాలి:


తుపానును దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
ధాన్యం సేకరణలో అగ్రెసివ్‌గా ఉండాలన్న సీఎం
కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంతవరకూ కొనుగోలు చేయాలని ఆదేశం
వర్షాల వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలి
ప్రతి పంటలో మూడింట ఒక వంతు పంటను మార్కెట్లో జోక్యం కింద కొనుగోలు చేయడానికి అధికారులు సిద్ధం కావాలన్న సీఎం
వీటికి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంటే... ధరల్లో స్థిరీకరణ వస్తుందన్న సీఎం
వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే.. పండే పంటలో మూడింట ఒక వంతు కొనుగోలు చేయాలి,
వాటిని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలి,
వాటికి మార్కెట్‌ను ఏర్పాటుచేసుకుని పంపాలి,
ఈ విధానాన్ని వ్యవస్థీకృతం చేసుకుంటేనే ధరల స్థిరీకరణ జరుగుతుందన్న సీఎం
పెరిషబుల్‌ గూడ్స్‌ను గతంలో ప్రభుత్వం ఎప్పుడూ కూడా సేకరించలేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అది జరిగిందని, గతంలో ఎన్నడూలేని విధంగా కూడా కొనుగోలు చేశామన్న అధికారులు
ఈ కొనుగోలును పెంచాలని అధికారులను ఆదేశించిన సీఎం


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు