వింజమూరు మండలం నల్లగొండ్లలో 2 కరోనా పాజిటివ్ కేసులు

వింజమూరు మండలం నల్లగొండ్లలో 2 కరోనా పాజిటివ్ కేసులు


వింజమూరు, మే 17 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలం నల్లగొండ గ్రామానికి చెందిన వ్యక్తులు చెన్నై నుండి వచ్చి కోరం టైమ్స్ లో ఉన్నారు. వారికి ఆదివారం ప్రభుత్వ వైద్యాధికారి హరికృష్ణ కోవిడ్-19 క్విట్లు ద్వారా 15 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు తాసిల్దార్ ఎం వి సుధాకర్ రావు తెలిపారు. ప్రాథమిక పరీక్షలో పాజిటివ్ రావడంతో వారిని నెల్లూరు తరలించి ల్యాబ్ ద్వారా పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేయవలసి ఉందని ఎస్సై బాజిరెడ్డి తెలిపారు. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా వారిని నెల్లూరు     104 అంబులెన్స్ ద్వారా నెల్లూరు కు తరలించారు.  ల్యాబ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయితే వింజమూర్ లో రెడ్ జోన్ గా మారే పరిస్థితి ఉంది. కనుక ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండీ బయట ప్రాంతాల నుండి వచ్చిన వారి వివరాలు అందజేయాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, ఆత్మకూరు డి.యల్.పి.ఓ అప్పాజీ, ఇంచార్జ్ ఈ.ఓ.పి.ఆర్.డి బంకా.శ్రీనివాసులురెడ్డి, పంచాయితీ కార్యదర్శి డి.ఖాజా రహంతుల్లా, వి.ఆర్.ఓ ఎస్.కే.రంతుల్లా తదితరులు నల్లగొండ్ల గ్రామంలో పర్యటిస్తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు.