బాలుడి వైద్య చికిత్సకు మన మైత్రి ఫౌండేషన్ 20,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం.

నిస్సహాయ స్థితిలో అమ్మ వార్తా కథనానికి స్పందించిన మన మైత్రి ఫౌండేషన్.


 బాలుడి వైద్య చికిత్సకు మన మైత్రి ఫౌండేషన్ 20,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం.


 మర్రిపాడు :మే 9 (అంతిమ తీర్పు ప్రతినిధి) : మానవత్వం పరిమళించింది  మంచి మనసును చాటుకుంది నూటికో కోటికో ఒక్కరు వారు ఎక్కడో ఉంటారు .కొంతమంది స్నేహితులు సేవాభావంతో ఒకటయ్యారు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు నేను సైతం అని ముందుకు వచ్చారు వివరాల్లోకి వెళితే మార్చి నెల 13వ తేదీన 'నిస్సహాయ స్థితిలో అమ్మ' ఒక్కగానొక్క కుమారుడిని ఆదుకోండి కిడ్నీలు పాడైపోయిన ఆ బాలుడి వైద్య చికిత్సకు సంబంధించి ఆ నిరుపేద దీనస్థితి గురించి మార్చి 13 వ తేదీ అంతిమ తీర్పు  పత్రికలలో మర్రిపాడు డేట్ లైన్ లో సమగ్ర కథనంగా ప్రచురితమైన
మర్రిపాడు మండలం ,భూదవాడ
పంచాయితీ బెడుసుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దలితురాలు :కుంటా ఆదెమ్మ భర్త శేఖర్ దంపతులకు నలుగురు సంతానంవీరిలో ముగ్గురు కుతురులు కాగా ఒక్కగానొక్క కుమారుడికి కిడ్నీ ;
సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితి రావడంఆడపిల్లలు పుట్టారని ఐదు సంవత్సరాల క్రిందటే భర్త ఆమెను .వదిలి వెళ్లిపోవడం ఆమెను నిలువునా కృంగదీసింది. కొన్ని నెలల ,క్రితం తీవ్ర ఆయాసంతో అస్వస్థతకు గురై. ఊపిరి తీసుకోవడం ,భారంగా మారింది. ఆత్మకూరు సుధాకర్ రెడ్డి హాస్పటల్ లో
చూపించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నెల్లూరుసర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం బిడ్డకు కిడ్నీ సంబంధిత జబ్బుతో బాధపడుతున్నాడని, శస్త్రచికిత్సతోనే అతనికి బాగుచెయ్యాలని ప్రచురితమైంది
ఆ కథనం యొక్క ప్రెస్ క్లిప్పింగ్ ఫేస్ బుక్ లో చూసిన దాతలు తమ మంచి మనసును చాటుకున్నారు. ఆ తల్లి దీనస్థితి వారిని కదిలించింది దీనితో ఆమెకు
బాధితుడు కార్తీక్ వైద్య సహాయానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు శనివారం మండల కేంద్రమైన మర్రిపాడు లో బాధిత కుటుంబానికి  కుటుంబం పెద్దయిన ఆదెమ్మ కు 20, 000వేల రూపాయలు  మన మైత్రి ఫౌండేషన్ సభ్యులు మేకల శ్రీనివాసులు,శివ సాయి,వెంకయ్య నాయుడు కలసి వచ్చి ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా మన మైత్రి ఫౌండేషన్ సభ్యులు మేకల శ్రీనివాసులు, శివ సాయి వెంకయ్య నాయుడు  సందర్భంగా  మాట్లాడుతూ తమ పౌండేషన్ ఎప్పుడు పేద ప్రజలను ఆదుకునేందుకు మన మైత్రి ఫౌండేషన్ నెలకొల్పబడింది అని ఫేస్ బుక్ లో ఈ యొక్క తల్లి దీనస్థితిని తెలుసుకొని సాయం అందజేయడం జరిగిందని మా ఫౌండేషన్ కి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ
 ఫేస్బుక్ ద్వారా తెలుసుకొని తమ యొక్క దీనస్థితి ని తెలుసుకొని ఆర్ధిక తోడ్పాటు అందించిన మైత్రి ఫౌండేషన్ సభ్యులకు బాధితుని తల్లి ఆదెమ్మ ముకుళిత హస్తాలతో కృతజ్ఞతలు తెలియజేశారు అదే సందర్భంలో
తమ యొక్క దీనస్థితిని పత్రికల ద్వారా సమాజం దృష్టికి తీసుకు వచ్చి తమకు సహాయం అందించేందుకు కీలక పాత్ర పోషించిన సదరు పత్రిక విలేకరులకు కృతజ్ఞతలు తెలియజేశారు 
జిల్లాలో ఉన్న సహృదయులు ఈ పేద కుటుంబాన్ని ఆదుకొని తమ దయనీయమైన స్థితిని గమనించి తమ బిడ్డ వైద్యానికి చేయూతనివ్వాలని బాధితుని తల్లి ఆదెమ్మ  విజ్ఞప్తి చేశారు.