ఆత్మ నిర్భర్ భారత అభియాన్*** పేరుతో   రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోడీ

ఒక్క వైరస్ ప్రపంచం మొత్తాన్నీ సమస్యల్లోకి నెట్టేసింది. ఇలాంటి పరిస్థితినీ ఎప్పుడూ చూడలేదు, కనీసం వినలేదు కూడా అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.


మోదీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం...మోదీ ఇంకా ఏమన్నారంటే...


కరోనావైరస్‌పై ప్రపంచ పోరాటం నాలుగు నెలలుగా సాగుతోంది.


ఒక వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల జీవితాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యావత్తు ప్రపంచం ఒక రకమైన యుద్ధం చేస్తోంది.


ఇదివరకు ఇలాంటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదు.వినలేదు.


మానవ జాతి ఇదివరకెప్పుడూ ఊహించని ఉత్పాతమిది.


కానీ, అలసిపోవడం, ఓడిపోవడం, వెనుకంజ వేయడం మనుషులు సహించరు.


మనల్ని మనం కాపాడుకోవాలి. ముందుకు సాగాలి.


ప్రతి రోజూ 2 లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల ఎన్95 మాస్కులు తయారుచేస్తున్నాం.


మన సంకల్పం ఈ సంక్షోభం కన్నా గొప్పది. 21వ శతాబ్దం భారతదేనని మనం గత శతాబ్దం నుంచి ఎప్పుడూ వింటూ వచ్చాం.


భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనావైరస్‌ మహమ్మారికి సంబంధించి ఐదోసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.


మార్చి 24 నుంచి అమల్లో ఉన్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది.


రెండోసారి విధించిన లాక్ డౌన్ వాస్తవానికి మే 3తో ముగియాల్సి ఉండగా, మరో రెండువారాల పాటు పొడిగిస్తూ మే 1న హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.


మే 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 10కి పైగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.


ఇప్పటికే మే 12 నుంచి రైలు ప్రయాణాలకు కేంద్రం అనుమతించింది. మే 15 లోపు దేశీయ విమానాలను ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.


ఈ నేపథ్యంలో మోదీ లాక్ డౌన్‌ను మరోసారి పొడిగిస్తారా లేక, లాక్ డౌన్ ఎత్తివేసేందుకు అవసరమైన ప్రణాళికలను వెల్లడిస్తారా అనేది వేచి చూడాలి.
 *ఆత్మ నిర్భర్ భారత అభియాన్*** పేరుతో  
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోడీ


ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశం నేడు అన్ని రంగాల్లో సత్తాను చాటుకుంటోంది.


స్వయం సమృద్ధి సాధించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. కరోనా సమయంలో భారతీయ ఔషధాలు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తున్నాయి. 


డిమాండ్ - సప్లయి చైన్ దెబ్బ తినకుండా చర్యలను ఇప్పటికీ ప్రారంభించాం 


*21వ శతాబ్దం మనదే. ఆత్మ నిర్భర భారతదేశమే మన లక్ష్యం*


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు