కర్నూలు లో తగ్గు ముఖం దిశగా కరోనా..ఇప్పటివరకు జిల్లాలో 218 మంది కరోనా విజేతలు డిశ్చార్చ్: కలెక్టర్ వీరపాండియన్

 Kurnool -08-05-2020*


*కర్నూలు లో తగ్గు ముఖం దిశగా కరోనా..ఇప్పటివరకు జిల్లాలో 218 మంది కరోనా విజేతలు డిశ్చార్చ్: కలెక్టర్ వీరపాండియన్


*కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన 27 మందిని ఈ సాయంత్రం డిశ్చార్జ్ చేశాము.. వీరిలో నంద్యాల సమీపంలో ఉన్న శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి  నుండి 8 సంవత్సరాల బాలిక (నంద్యాల వాసి),  కర్నూలు సమీపంలో ఉన్న విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుండి 12 మందిని, కర్నూలు చైతన్య ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ నుండి 14 మందిని ఈ సాయంత్రం డిశ్చార్చ్ చేసాము: కలెక్టర్ జి.వీరపాండియన్*


*ఈ సాయంత్రం డిశ్చార్చ్  అయిన 27  మందిలో విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి అతి చిన్న వయసు ఉన్న ఏడాదిన్నర బాలిక, 80 సం.ల వయసుతో పాటు బిపి, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వృద్ధుడు ..శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి 8 ఏళ్ల బాలిక కరోనాను జయించి ఆరోగ్యంగా కోలుకుని డిశ్చార్చ్ కావడం..జిల్లా వాసులందరికీ కరోనా మహమ్మారిని జయించవచ్చనే మనోధైర్యాన్ని, స్ఫూర్తిని కలిగించడం చాలా విశేషం... సంతోషం: కలెక్టర్ వీరపాండియన్*


*ఈ రోజు డిశ్చార్చ్ ల్లో మరో విశేషం..జిల్లాలో మొట్ట మొదటిసారిగా కర్నూలు చైతన్య ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ నుండి 14 మంది కరోనా విజేతలు (Asymptomatic Patients) ఆరోగ్యంగా డిశ్చార్చ్ కావడం: కలెక్టర్ వీరపాండియన్*


*ఈ రోజు డిశ్చార్చ్ అయిన 27 మంది లో 13 మంది పురుషులు, 12 మంది  మహిళలు, ఇద్దరు బాలికలు. వీరిలో ఒకటిన్నర ఏడాది నుండి 10 ఏళ్ల లోపు చిన్న వయసు ఉన్న ఇద్దరు చిన్నారి బాలికలు, 18 నుండి 50 ఏళ్ల  మధ్య వయసుగల వారు 20  మంది, 50 నుండి 79 ఏళ్ల మధ్య వయసులోపు  వారు 4 గురు,  80 ఏళ్ల వృద్ధులు ఒకరు కరోనాను జయించడం జిల్లా వాసులకు పెద్ద రిలీఫ్: కలెక్టర్ వీరపాండియన్*


*ఈ సాయంత్రం డిశ్చార్చ్ అయిన 27 మంది కరోనా విజేతల్లో కర్నూలు నగర వాసులు 25 మంది, పాణ్యం - ఒక్కరు,  నంద్యాల-ఒక్కరు ఉన్నారు : కలెక్టర్ వీరపాండియన్*


*ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 218 మంది కరోనా విజేతలు డిశ్చార్చ్..వీరిలో ఒక్క విశ్వభారతి  కోవిడ్ ఆస్పత్రి నుండే డిశ్చార్చ్ లు 112 దాటడం అభినందనీయం..టీమ్ విశ్వభారతి చైర్మన్ డా.కాంతారెడ్డి, ప్రిన్సిపల్ డా. మునీరుద్దీన్, స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ మల్లిఖార్జున తో పాటు టీమ్ శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రి చైర్మన్ ఎం. శాంతిరామ్,  డా.మాధవిలత,  డా.కాంతారావు నాయక్, స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ పి.వెంకట నారాయణమ్మ, టీమ్ కోవిడ్ కేర్ సెంటర్ ఇంఛార్జి అధికారులు డిఎఫ్ఓ అలాన్ చాంగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి చంద్ర శేఖర్, ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, పోలీసులు, రెవెన్యూ తదితర శాఖల అధికారులను, మనోధైర్యం తో కోవిడ్ ను జయించిన కరోనా విజేతలను అభినందించిన  కలెక్టర్ వీరపాండియన్*


*కర్నూలు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం దిశగా వెళుతున్న నేపథ్యంలో  కరోనా కోరల నుండి ఆరోగ్యంగా బయటపడి ఒకే రోజు  పెద్ద సంఖ్యలో 27 మంది డిశ్చార్చ్ కావడం ...దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వృద్ధులు కూడా ఎక్కువ సంఖ్యలో కరోనాను జయించడంతో పాటు ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్చ్ అయిన వారి సంఖ్య 218 కు పెరగడం .. బిగ్ రిలీఫ్...జిల్లా ప్రజలందరికీ,  జిల్లా యంత్రాంగానికి కరోనాను జయించవచ్చనే మనో ధైర్యం ..నమ్మకం పెరిగింది:  కలెక్టర్ వీరపాండియన్*


*ఈ సాయంత్రం కర్నూలు విశ్వభారతి, శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రుల నుండి, కర్నూలు  చైతన్య ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్ నుండి డిశ్చార్చ్ ఆయిన 27 మందికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదును అందించి...ప్రత్యేక అంబులెన్స్ వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపిన స్పెషల్ ఆఫీసర్స్, అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది*


*కరోనా బారిన పడి..మెరుగైన ప్రభుత్వ వైద్యం..సదుపాయాలతో .. కరోనా మహమ్మారిని జయించి..ఆరోగ్యంగా.. ఆనందంగా.. కర్నూలు జిల్లా కోవిడ్ ఆస్పత్రుల నుండి ఈ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లిన 27 మంది*
 
*గత నెలలో జిల్లా కోవిడ్ ఆస్పత్రులు శాంతిరామ్, విశ్వభారతి, కర్నూలు చైతన్య కోవిడ్ కేర్ సెంటర్ లో  ఆ 27 మందిని అధికారులు, వైద్య సిబ్బంది చేర్పించి...ప్రభుత్వ సాయంతో.. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం కృషితో..కరోనా మహమ్మారిని జయించి..ఆరోగ్యంగా కోలుకుని..కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం 2 సార్లు రిపీట్ టెస్ట్ లను చేయించుకుని  నెగటివ్ ఫలితం రావడంతో ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసిన  డాక్టర్లు**కరోనా బారిన పడినా తమ నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకుండా మొత్తం  ప్రభుత్వం తరఫున భరించి.. తమను బాగా చూసుకుని..ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదును కూడా ఇచ్చి ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి,  ప్రభుత్వానికి,   డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ వీరపాండియన్,  అందరికీ ధన్యవాదాలు తెలిపిన 27 మంది కరోనా విజేతలు*


*ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో కరోనా విజేతలుగా నిలిచి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లి...అందరిలో ధైర్యాన్ని, స్ఫూర్తి ని నింపిన 218 మంది కరోనా విజేతలు*


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image