ఉదయగిరికి తాగునీరందించే వ్యవస్థపై అధ్యయనం చేయండి : ఉప రాష్ట్రపతి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, నీతి ఆయోగ్ సీఈవోకు ఉపరాష్ట్రపతి సూచన ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తలెత్తిన నీటి ఎద్దడి పరిస్థితిని సీనియర్ అధికారులకు వివరించిన ఉప రాష్ట్రపతి* మే 25, 2020, న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.. ఉదయగిరి నియోజకవర్గం ఎదుర్కుంటున్న సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. సోమవారం నీతి ఆయోగ్ సీఈవో శ్రీ అమితాబ్ కాంత్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కార్యదర్శి శ్రీ యూపీ సింగ్, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పరమేశ్వరన్ అయ్యర్ తో ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన సమావేశంలో ఉదయగిరి ప్రజలు ఎదుర్కుంటున్న నీటి సమస్యలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. కరువుపీడిత ప్రాంతమైన ఉదయగిరికి తాగు, సాగునీటిని అందించే సాధ్యాసాధ్యాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. లాక్ డౌన్ సమయంలో.. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా (1978లో) ఎన్నికైన ఉదయగిరి ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో వారు.. అక్కడి నీటి ఎద్దడి పరిస్థితులను ఉపరాష్ట్రపతికి ఏకరువుపెట్టారు. భూగర్భజలాలు అడుగంటడంతో చెరువులు, బోరుబావులు ఎండిపోయాయని తెలిపారు. వరుసగా ఏడో ఏడాదీ సరిగ్గా వర్షాలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది నుంచైనా లేదా.. సోమశిల ప్రాజెక్టునుంచైనా తమకు నీటిని ఇప్పించాలని వారు ఉపరాష్ట్రపతిని కోరారు. ఈ నేపథ్యంలో జరిగిన సోమవారం నాటి సమావేశంలో.. ఉదయగిరికి నీటిని అందించేందుకు సాంకేతిక సంభావ్యత (టెక్నికల్ ఫీజిబిలిటీ), సవివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అంశాలపై చర్చించాలని అధికారులకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నీటి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనితీరును కూడా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, నీతి ఆయోగ్ అధికారుల బృందం ఉదయగిరిలో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడితే వాస్తవ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసేందుకు వీలవుతుందన్నారు. దీనికి అధికారులు స్పందిస్తూ.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, వీలుచూసుకుని ఉదయగిరిలో పర్యటిస్తామని, అక్కడి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి.. సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. పర్యటన అనంతరం తదుపరి వివరాలతో మరోసారి కలుస్తామని ఉపరాష్ట్రపతికి విన్నవించారు. ఈ కార్యక్రమలో ఉపరాష్ట్రపతి కార్యదర్శి శ్రీ ఐవీ సుబ్బారావు కూడా పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image