ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంలో మృతులకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి :  వర్ల రామయ్య

వర్ల రామయ్య విలేకరుల సమావేశ వివరాలు –15-5-2020
 ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంలో మృతులకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి 
రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించే వరకూ తెదేపా ఆందోళన చేస్తుంది  
దళిత వర్గానికి చెందిన 9 మంది చనిపోతే ప్రభుత్వం నుంచి సాంత్వన, ధైర్యం చెప్పే దిక్కులేదు
జగన్ రాచరిక పోకడలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు 
జగన్ ప్రభుత్వం దళితుల పట్ల కపట ప్రేమ చూపుతోంది 
విశాఖలో గ్యాస్ ప్రమాదంలో స్పందించి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చిన వైకాపా ప్రభుత్వం దళిత వర్గ కూలీల విషయంలో ఉదాశీనతగా వ్యవహరించడమేమిటి? 
9 మంది దళిత కూలీలు చనిపోతే మంత్రులు అధికారులు ఎందుకు వెళ్ళలేదు 
ప్రభుత్వం నిర్లక్ష వైఖరితో సామూహిక సమాధి చేసుకున్న దుర్భరస్థితి 
నిర్లక్షంగా వ్యవహరించిన వైకాపా ప్రభుత్వానికి దళితుల ఉసురు తగలక మానదు : తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం 
          ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ ప్రమాద మృతులకు ఉంటే ఒక్కోక్కరికి రూ. 25 లక్షలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.  వైకాపా ప్రభుత్వానికి  చిత్తశుద్ధి దళితుల అభివృద్ధి  పట్ల ఆకాంక్ష, అభిమానం, ఆదరించాలన్న ఆలోచన శ్రద్ధ దళితులను ఆదుకోవాలి. దళితులను వైకాపా ప్రభుత్వం అంటరాని వాళ్ళుగా చూస్తున్నారా? మృతుల్లో విద్యార్థులున్నా కనీసం జాలి చూపకపోవడం, చిన్న చూపు చూపడం దారుణం. దళితుల ఆగ్రహానికి గురైన ఏ ప్రభుత్వం కూడా ఆట్టే మనజాలదు. దళితులతో పెట్టుకున్న ప్రభుత్వాలు అధికారంలో కొనసాగలేవు. దళితుల పట్ల సీఎం, మంత్రులు, అధికార యంత్రాంగం ప్రవర్తించిన తీరు అభ్యంతరకరం. దళితులంటే వైకాపా నేతలకు ఈసడింపుగా , అంటరానివారుగా కనపడుతున్నారు.  రూ.25లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించే వరకూ దళిత మృతుల కుటుంబాల తరఫున తెదేపా ఆందోళన చేస్తుంది. ప్రమాదంలో చనిపోయిన మృతులకు ఏ లాంఛనాలు లేకుండా దిక్కులేని విధంగా సామూహిక సమాధి జరగడం దురదృష్టకరం. నిర్లక్షంగా వ్యవహరించిన వైకాపా ప్రభుత్వానికి దళితుల ఉసురు తగిలితే మంచిది కాదని గ్రహించాలి.             
ప్రకాశం జిల్లాలో నాగులుప్పలపాడు మండలం రాపర్ల వద్ద విద్యుత్ స్తంభాన్ని టాక్టర్ ఢీకొట్టిన 
ఘోర రోడ్డు  ప్రమాదంలో 9 మంది కూలీలు మృతి చెందడం పట్ల తెదేపా ఆవేదన, సంతాపం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి అగమ్యగోచరంగా ఉంది. అర్థం కాని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా గ్రామంలో ట్రాక్టర్ ఎలక్ట్రికల్ పోల్ కు ఢీకొనగా ప్రమాదం సంభవించడం దురదృష్టకరం.  
 ఈ ప్రమాదానికి లోనైన దళిత వర్గ కూలీల విషయంలో వైకాపా ప్రభుత్వం ఉదాశీనతగా వ్యవహరిస్తోంది.  సరైన రీతిలో ఈ ప్రభుత్వం స్పందించలేదు. విశాఖలో గ్యాస్ ప్రమాదంలో స్పందించిన రీతులో బాధితుల పట్ల కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తానని ప్రకటించినంత వేగంగా 9 మంది దళితులు  చనిపోతే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రకాశం జిల్లాలోని  మంత్రులు, ఎమ్మెల్యే , కలెక్టర్,ఎస్పీలు సైతం  ప్రమాద సంఘటన స్థలానికి  వెళ్ళలేదు. మృతుల మానాన వాళ్ళను వదిలేశారు. ఎస్సై మాత్రమే వెళ్ళి చూడటం దురదృష్టకరం. దళితులకు మాయమాటలు చెప్పి దళిత ఓట్లు దండుకోడానికి ముఖ్యమంత్రి అసాధ్యపు వాగ్దానాలను చేశారు. దళితుల పట్ల సీఎంకి ప్రేమ,అభిమానం ఇదేనా? దళితుల పట్ల వైకాపా ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తోంది. దళితవర్గాల  వద్దకు వెళ్ళి తమ పార్టీ వారి ఉద్ధరణకు కృషి చేస్తామన్నది డ్రామానేనా? అదంతా నటనేనా? దళిత వర్గానికి చెందిన 9 మంది చనిపోతే ప్రభుత్వం నుంచి సాంత్వన, ధైర్యం చెప్పే దిక్కులేదు. విశాఖలో పోటీ పడి మంత్రులు వెళుతూ నిద్రలు చేస్తున్నారు. ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబసభ్యులను కలసి సంతాపం,  సానుభూతి చూపలేకపోయారా? ఎన్నికల ప్రచారంలో దళితులకు బంగారు తొడుగులు తొడుగుతాం, అందలమెక్కిస్తామని అలవికాని హామీలు ఎందుకు ఇచ్చారు? ఈ దుర్ఘటనలో మృతులకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత  ప్రభుత్వ సాయం లేకపోవడం, పట్టించుకోక పోవడంతో సామూహిక సమాధి చేసుకున్నారు. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రాని విషయం సీఎం జగన్ కు తెలుసా? విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాద మృతుల కుటుంబాలకు  కోటి ఎక్స్ గ్రేషియా ఇస్తే, దళిత బిడ్డలకు రూ.5లక్షలా ? సొంత కంపెనీ అన్నట్లు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని కాపాడటానికి ఈ ప్రభుత్వం తాపత్రయపడి, ప్రకాశం జిల్లా దళిత వర్గ కూలీలను నిర్లక్షం చేసింది. ఇక్కడి దళిత కూలీలతో వైకాపా ప్రభుత్వానికి సంబంధం లేదా? దళితులు చచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం పట్టించుకోదని తేటతెల్లం అయింది.  జగన్ నేతృత్వంలో చట్టాలు  లేవు, ఉన్నా పని చేయడంలేదు. జగన్ ఏమి చెబితే అదే చట్టమైంది. రాచరిక పోకడలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు.   సీఎం జగన్ ఉదాశీనంగా వ్యవహరిస్తూ దళితుల బంధువులనే చెప్పుకోవడం పెద్ద డ్రామాకాదా? సీఎం క్యాం ఆఫీసు నుంచి బయటకు రాని జగన్  స్పందించకపోవడం  చనిపోయిన దళితులు దిక్కులేని వారనేనా అలుసు? 
--వర్ల రామయ్య, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు .