నిరాశ్రయులకు సేవ చేయడం మా బాధ్యత: ఏబీవీపీ నాయకులు
04-05-2020
గూడూరు మే.4 (అంతిమ తీీర్పు) : ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక చిల్లకూరు పరిధిలోని ఎస్ టి మిక్సిడ్ కాలనీలో పౌష్టికాహారం కోడిగుడ్లను పంచి పెట్టడం జరిగింది మరియు విందూరు కాలువ కట్ట మీద ఉన్న నిరాశ్రయులకు భోజన ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎబివిపి నాయకులు మాట్లాడుతూ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ప్రతి రోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈరోజు పౌష్టికాహారం కోడి గుడ్లు మరియు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చిన్న హర్షవర్ధన్ శ్యామ్ సూర్య తదితరులు పాల్గొన్నారు
నిరాశ్రయులకు సేవ చేయడం మా బాధ్యత: ఏబీవీపీ