బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి

బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు
-327వ ఆరాధనా ఉత్సవాలు(02.05.2020) ఇళ్లలోనే జరుపుకోవాలి
-ఒక ప్రకటనలో విశ్వ బ్రాహ్మణులకు, బ్రహ్మంగారి భక్తులకు పిలుపు
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 327 వ ఆరాధనా ఉత్సవాల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణ సోదర, సోదరీమణులకు, బ్రహ్మంగారి భక్తులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సజీవ సమాధి పొందిన రోజు శనివారం బ్రహ్మం గారి ఆరాధనలు లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లల్లోనే భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని కోరారు.
‘‘బ్రహ్మంగారు గొప్ప కాలజ్ఞాని.. ఆధ్మాత్మిక వేత్త, సంఘ సంస్కర్త, గొప్ప తత్వవేత్త...తన బోధనల ద్వారా జాతిని జాగృతం చేశారు. భోగ భాగ్యాల కన్నా, సమాజ హితమే మిన్నగా బోధించారు. కులాధిక్యతను ఖండించారు, మత మౌఢ్యాన్ని నిరసించారు. పరమత సహనం, శాంతియుత సహజీవనం, సర్వమానవ సౌభ్రాతృత్వం చాటిచెప్పారు.బ్రహ్మంగారి బోధనలు ప్రాత: స్మరణీయం. సర్వ మానవాళికి అనుసరణీయంగా’’ పేర్కొన్నారు.
బ్రహ్మంగారి మఠం అభివృద్దికి టిడిపి కృషి: 
‘‘బ్రహ్మంగారు అంటే ఎన్టీఆర్ కు ఎంతో గౌరవాభిమానాలు. బ్రహ్మంగారి జీవిత చరిత్రపై ఆయన తీసిన సినిమా ‘‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’’ గొప్ప సక్సెస్. పల్లెటూళ్లనుంచి ఎడ్లబండ్లు కట్టుకుని మరీవచ్చి ఆ సినిమా చూడటానికి పల్లె ప్రజలు పోటీబడటం తెలిసిందే. 
కడప జిల్లా కందిమల్లయ్యపల్లి లో బ్రహ్మంగారు సజీవ సమాధి పొందిన ప్రాంతం. ‘‘బ్రహ్మంగారి మఠం’’ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక చర్యలు-పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతంగా అభివృద్ది-తెలుగుగంగ పథకంలో భాగంగా బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ అభివృద్ది చేశాం. రాయలసీమ జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించామని’’ గుర్తు చేశారు. 
కాలజ్ఞానంలో సూక్తులు అక్షర సత్యాలుగా నేటికీ నిరూపితం:
‘‘కాలజ్ఞానం’’లోని బ్రహ్మంగారి సూక్తులన్నీ భవిష్యత్తులో అక్షర సత్యాలుగా నిరూపితం కావడం తెలిసిందే. ప్రస్తుత కరోనా వ్యాధి గురించి కూడా తన కాలజ్ఞానంలో ముందే పేర్కొన్నారని విన్నాం. ఈశాన్యాన కోనంకి వ్యాధి పుడుతుందని, లక్షలాది మంది బలి అవుతారని చెప్పినట్లుగా కాలజ్ఞానంలో ఉంది.
కులమత రహిత సమాజం గొప్పదనాన్ని తన సూక్తులలో పేర్కొన్నారు. బ్రహ్మంగారి బాటలో నడుద్దాం. ఆయన సూక్తులు స్మరిద్దాం. బ్రహ్మంగారి బోధనలు అనుసరిద్దాం. కులమత రహిత సమాజం ఏర్పాటే లక్ష్యంగా పనిచేద్దాం. సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం కృషి చేద్దాం. కులాల కుంపట్లకు దూరంగా ఉందాం. పరమత సహనం పాటించడం, శాంతియుత జీవనమే బ్రహ్మంగారికి మనం అర్పించే నిజమైన నివాళి’’గా చంద్రబాబు పేర్కొన్నారు.
                                  ----


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image