నేడు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం

మానవీయ కోణంలో రాష్ట్రంలో రెడ్ క్రాస్ సేవలు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషన్ హరిచందన్
నేడు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం


ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎపి స్టేట్ బ్రాంచ్ అధ్యక్షుడు శ్రీ బిస్వ భూషన్ హరిచందన్ రెడ్‌క్రాస్ సభ్యులు, వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలిపారు.  అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ఐసిఆర్‌సి) వ్యవస్థాపకుడు, మొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జీన్ హెన్రీ డునాంట్ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 8 న ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని,  రెడ్ క్రెసెంట్ డే లను జరుపుకోవటం అనవాయితీగా ఉంది.  అంతర్జాతీయ రెడ్‌క్రాస్ ఉద్యమ సూత్రాల వార్షిక వేడుకగా ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం నిర్వహిస్తుండగా, రెడ్ క్రాస్ సంస్ధ ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంస్ధగా ఖ్యాతిని గడించింది. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతి సంవత్సరం మానవతా ఇతివృత్తంతోనే ఈ శుభదినాన్ని జరుపుకుంటుంది. భారతదేశానికి ప్రపంచ రెడ్ క్రాస్ డే  2020  ప్రత్యేకమైనది, ఎందుకంటే 1920 లో స్థాపించబడిన భారత రెడ్ క్రాస్ సొసైటీ యొక్క శతాబ్ది సంవత్సరాన్ని ఇది సూచిస్తుంది. 
ప్రపంచాన్ని కరోనా మహమ్మరి బాధిస్తున్న తరుణంలో ఈ సంవత్సరం “వాలంటీర్ల కోసం చప్పట్లు” థీమ్ తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనాపై పోరులో మొదటి వరుస యోధులుగా ఉన్న లక్షలాది మంది రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలను ఈ సందర్భంగా గవర్నర్ ప్రస్తుతించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ ఒక శక్తివంతమైన సంస్థగా ప్రజలకే సేవలు అందిస్తుందని, ఇది ప్రజల విలువైన ప్రాణాలను కాపాడటానికి కట్టుబడి ఉందని మాననీయ గవర్నర్ అన్నారు. ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయం, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం కృషి, విశాఖపట్నంలో తాజాగా జరిగిన గ్యాస్ లీకేజ్ సంఘటనతో బాధపడుతున్న ప్రజల సహాయక చర్యలు ఇలా,,, వాలంటీర్లు పోషించిన పాత్రను ఎంచదగినదని గవర్నర్ ప్రశంసించారు. సహాయం అవసరమైన ప్రజలకు రెడ్ క్రాస్ ఎపి స్టేట్ బ్రాంచ్ నిరంతరం అందుబాటులో ఉందన్నారు. 
సంస్థ కోసం వాలంటీర్లుగా పనిచేయడానికి ఇష్టపడే వారిని చేర్చుకునేందుకు ‘టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1234’ తో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని,  ఎపి రెడ్ క్రాస్ రాష్ట్రవ్యాప్తంగా 21 కమ్యూనిటీ కిచెన్‌లను నిర్వహించి 6.2 లక్షలకు పైగా ఫుడ్ ప్యాకెట్లు, 215 టన్నుల బియ్యం, కూరగాయలు, డ్రై రేషన్, 89,000 జతల చేతి తొడుగులు, 2.6 లక్షల ఫేస్ మాస్క్‌లను పేద, నిరాశ్రయులు, బలహీన వర్గాలకు పంపిణీ చేసిందని బిశ్వ భూషన్ వివరించారు.  వివిధ ప్రభుత్వ విభాగాలు, ఇతర ఎన్జిఓల సహకారంతో  రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలను అందించడం ద్వారా కోవిడ్ -19 ఐసోలేషన్ సెంటర్లలో పెద్ద ఎత్తున సహాయకులుగా వ్యవహరిస్తున్నారని గవర్నర్ తెలిపారు.  రాష్ట్రంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఉద్యమానికి బలోపేతం చేయటంలో సంస్ధ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి ఎకె ఫరీడా బృందం మంచి పనితీరును చూపుతుందని గవర్నర్ ప్రశంసించారు.


Popular posts
జ్ఞానపీఠ్” అవార్డ్ గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ వర్దంతి. (అక్టోబర్ 18)
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఏడువారాల నగల గురించి సంపూర్ణంగా అర్థం వివరణ
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image