4380 నుంచి 2934కి తగ్గుతున్న మద్యం షాపులు*

*09–05–2020,*
*అమరావతి.*


*మద్య నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు


*ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ*


*తాజాగా మరో 13 శాతం షాపులు తొలగింపునకు ఆదేశాలు జారీ*


*గతంలోనే 20 శాతం షాపులను తొలగించిన ప్రభుత్వం*


*దీంతో మొత్తం 33 శాతం షాపులను తగ్గించిన ప్రభుత్వం*


*4380 నుంచి 2934కి తగ్గుతున్న మద్యం షాపులు*


*ఈ నెలాఖరు నాటికి 13 శాతం షాపులు తొలగించాలని ఉత్తర్వులు*


*అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్ట్‌ షాపులు తొలగించిన ప్రభుత్వం.


*ప్రజారోగ్యమే  ప్రధాన లక్ష్యం– ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం*


*మద్యం మహమ్మూరిని శాశ్వతంగా పారదోలడమే ప్రభుత్వ లక్ష్యం*


*దేశంలో మరే రాష్ట్రంలోని లేని విధంగా మద్య నియంత్రణ చర్యలు*


*అమరావతి.*


మద్యపాన నియంత్రణదిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. 
మద్యం వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43000 బెల్టు షాపులను తొలగించింది. దీంతో పాటు ప్రైవేటు వ్యక్తుల మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించింది. 
మద్యం అమ్మకాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేటట్టు నిర్ణయం తీసుకుంది. 
వీటికి అదనంగా మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు చిత్తశుద్ధితో పలు చర్యలు తీసుకుంటోంది. 


*ఆ వివరాలు...*


1. లిక్కర్‌ షాపుల వద్ద గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పర్మిట్‌ రూంలను రద్దు చేసింది. 
2. ఒక వ్యక్తి గరిష్టంగా లిక్కర్‌ లేదా బీరు కేవలం మూడు బాటిల్స్‌ వరకు మాత్రమే కొనుగోలుకు అవకాశమిచ్చింది. అంతకు మించి కొనుగోలు చేసినా, అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలకు ఆదేశించింది. 
3. మద్యం అమ్మకాలను తగ్గించేందుకు కాలపరిమితిని విధించింది.
గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాల ఇచ్చిన   కాలపరిమితిని తగ్గించి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతులు మంజూరు చేసింది.  
4. మద్యం వినియోగాన్ని మరింత గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షాపుల సంఖ్య 4380 నుంచి 3500కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 
5. మద్యం అక్రమ అమ్మకాలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఏపీ బెవరేజేస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, స్వయంగా రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ద్వారా మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 
6. మరోవైపు వినియోగాన్ని తగ్గించేందుకు మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం కొనాలంటేనే భయపడేలా షాక్‌ కొట్టే విధంగా ధరలను పెంచుతూ నిర్ణయం కూడా తీసుకుంది. 
7. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లలో 40 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న 840 బార్లు 530కి తగ్గాయి.  
8. వీటికి తోడు మద్యం వినియోగాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా మద్య విమోచన  ప్రచార కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 ఈ కమిటీ ద్వారా మద్యపానం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించడంతో పాటు మద్యం మహమ్మారి కుటుంబాలను ఏ విధంగా నాశనం చేస్తుందో తెలియజెప్పే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 


9. వీటితో పాటు ప్రభుత్వం అక్రమ మద్యం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. 
10. అక్రమ మద్యం తయారీదారులపై గట్టి నిఘా పెట్టి వారిపై తరచూ దాడులు నిర్వహిస్తోంది.
11. ఫలితంగా గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మద్యం అమ్మకాలు, తయారీ, రవాణాపై గట్టి నిఘా పెట్టి పెద్ద ఎత్తున అరెస్టులు చేయడం జరిగింది. 


*గడిచిన నాలుగేళ్లలో కేవలం జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు అక్రమ మద్యం పై తీసుకున్నచర్యల వివరాలు.*


*తెలుగుదేశం పార్టీ హయాంలో*


తెలుగుదేశం పార్టీ హయామంలో 2017లో(జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు) 3,812 కేసులు నమోదు కాగా 2,487 మందిని అరెస్టు చేసి, 30,084 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు.
9,08,320 లీటర్ల పై చిలుకు బెల్లంఊట ధ్వంసం చేయడంతో పాటు, 59,049 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని, 191 వాహనాలను సీజ్‌ చేసారు. 


2018లో (జనవరి నుంచి ఏప్రిల్ వరకు) 3,579 కేసులు నమోదు కాగా 2,763 మందిని అరెస్టు చేసి, 34,540 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు.
అదే పీరియడ్‌లో 6, 58,738 లీటర్ల బెల్లంఊట ధ్వంసం చేయడంతో పాటు, 51,026 కేజీల నల్ల బెల్లం స్వాధీనం చేసుకుని, 188 వాహనాలకు సీజ్‌ చేశారు.
 
2019లో (జనవరి నుంచి ఏప్రిల్ వరకు) 5,442 కేసులు నమోదు కాగా, 3,526 మందిని అరెస్టు చేసి 56,179 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
8,98,118 లీటర్ల బెల్లంఊట ధ్వంసం చేయడంతో పాటు 46,594 కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని, 330 వాహనాలను సీజ్‌ చేశారు. 


*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు*


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నియంత్రణ దిశగా  అక్రమ మద్యం అక్రమాల పై  ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. కేవలం 2020 జనవరి నుంచి ఏఫ్రిల్‌ వరకు మద్యం అక్రమాలకు పాల్పడుతున్నవారిపై7,812 కేసులు నమోదు కాగా, 5,870 మందిని అరెస్టు చేసి, 97,482 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఏకంగా 16 లక్షల 41 వేల 134 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడంతో పాటు 70,161 కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న 1541 వాహనాలను సీజ్‌ చేశారు. 


*లాక్‌ డౌన్‌ పీరియడ్‌లో మద్యపాన నియంత్రణ కోసం ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంది.*


*అందులో  భాగంగా..*
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         ఏప్రిల్‌ 22 నుంచి ఇంతవరకు అక్రమ మద్యం విక్రయాలపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం 1462 కేసులు నమోదు చేసి 1282 మందిని అరెస్టు చేసి, 14,759 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3,63,430 లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేసిన పోలీసులు 12,718 కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకుని, 428 వాహనాలను సీజ్‌ చేశారు. 


మరోవైపు గ్రామ, వార్డు వాలంటీర్లతో పాటు గ్రామాల్లో నియమించిన మహిళా మిత్ర, మహిళా రక్షక్‌ల సేవలను కూడా వినియోగించుకుంటూ అక్రమమద్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది.


వీటికి అదనంగా పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు కూడా ప్రభుత్వం  గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పక్క రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తరచూ సమావేశాలు నిర్వహించడంతో పాటు  అక్రమ మద్యం తయారీ, నిల్వ దారులపై సంయుక్తంగా దాడులు కూడా నిర్వహించడం ద్వారా మద్యం అమ్మకాలకు చెక్‌ పెడుతోంది. 


ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ప్రజలకు సమర్ధవంతమైన పరిపాలన అందించడంతో పాటు ప్రజా ప్రయోజనం దృష్ట్యా మద్యాన్ని నియంత్రించడం మరియు మద్యం అమ్మకాలను కూడా ప్రభుత్వం క్రమబద్దీకరించింది. 


మరోవైపు అక్రమ మద్యం తయారీపై కూడా గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. 
మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా ఏపీ స్టేట్‌ బెవరేజేస్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  షాపుల సంఖ్యను 33 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
తద్వారా మొత్తం మద్యం షాపులు 4380 నుంచి తగ్గి ఈ నెలాఖరు నాటికి కేవలం 2934 షాపులు మాత్రమే ఉండనున్నాయి. (తాజాగా 13 శాతం షాపులను తగ్గించాలని జారీ చేసిన ఉత్తర్వులుతో కలుపుకుని)


Popular posts
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
ప్రపంచం అంతా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సం జరుపుకుంటోంది.: నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి*
Image
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పాఠశాలల ప్రారంభ నిర్ణయంపై పునరాలోచించాలి* ఏ.బి.వి.పి నేత చల్లా.కౌశిక్.... వింజమూరు, ఆగష్టు 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచించడం సబబు కాదని, వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కౌశిక్ బుధవారం నాడు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాక్షాత్తూ విద్యాశాఖా మంత్రి కరోనా బారిన పడి బాధపడుతున్నా వారికి బోధపడక పోవడం ఆశ్చర్యకరమన్నారు. జగనన్న విద్యాదీవెన, నాడు-నేడు పధకాల ప్రారంభం, ప్రచార ఆర్భాటాల కోసం పిల్లల జీవితాలను పణంగా పెట్టాలని చూస్తే ఏ.బి.వి.పి చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్యార్ధుల తల్లిదండ్రులతో గ్రామ, గ్రామీణ సర్వేను ఏ.బి.వి.పి నిర్వహించిందని కౌశిక్ పేర్కొన్నారు. 82 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఉన్నత విద్య, డిగ్రీ, పి.జీ, విశ్వ విద్యాలయాలలో చదివే విధ్యార్ధులు రోగనిరోధక శక్తి కలవారన్నారు. వారిని కాకుండా కేవలం ముందుగా పాఠశాలల బడులను తెరవడంలో ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఇలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పర్యవసానాలలో భాగంగా ప్రారంభించిన కొద్ది రోజులలోనే లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఆన్లైన్ ఫీజుల దందాను అరికట్టడంలో శ్రద్దాసక్తులు లేని రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల ప్రారంభానికి ఎందుకంత ఆరాటమన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని ఇక ప్రత్యక్షంగా చేసుకోవడానికి ప్రభుత్వం మార్గాలు సుగమం చేయడమేనని కౌశిక్ దుయ్యబట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందా - ప్రభుత్వ పధకాల ప్రచార దందా రెండూ కలిసి వస్తాయా అని సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రోగ నిరోధక శక్తి తక్కువ కలిగి ప్రస్తుత కరోనా పరిస్థితులను ఎదుర్కోలేని పసిపిల్లలపై ప్రభుత్వ అసంబద్ధ ప్రయోగాలు విరమించుకోవాలని హితువు పలికారు. లేని పక్షంలో ఏ.బి.వి.పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని కౌశిక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Image