రాగల 48 గంటలపాటు  కోస్తాంధ్ర,రాయలసీమకు వర్షసూచన


*విపత్తుల నిర్వహణ శాఖ*
🌨🌨🌨🌨🌨🌨🌨🌨🌨
*ఐఎండి వాతావరణ సూచన*


🌨 దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో  *అల్పపీడనం* ఏర్పడింది. 48 గంటల్లో బలపడి ఆ తదుపరి 48గంటల్లో (నాలుగు రోజులు) వాయుగుండంగా మారే అవకాశం


🌨 *రాగల 48 గంటలపాటు  కోస్తాంధ్ర,రాయలసీమకు వర్షసూచన* 🌨   *కోస్తాంధ్ర , రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో  కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం*


 🌨 *కోస్తా తీరం వెంబడి గంటకు 30-40 కీ.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం*   


🌨 *సముద్రం అలజడిగా ఉంటుంది.మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు:- విపత్తుల శాఖ కమిషనర్*


☀️ *రాగల 48 గంటలు రాయలసీమలో పలుచోట్ల 41°C -43°C అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం*


*వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు  తీసుకోవాలి :-విపత్తుల శాఖ కమిషనర్*


⛈️ *ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి:-విపత్తుల శాఖ కమిషనర్*


*ప్రజలు అప్రమత్తంగా  ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :- విపత్తుల శాఖ కమిషనర్*