ఏపీ కాటన్ అసోసియేషన్ టీఎంసీ డివిజన్ ముఖ్యమంత్రి సహాయనిధికి 5 లక్షలు విరాళం

గుంటూరు:


ఏపీ కాటన్ అసోసియేషన్ టీఎంసీ డివిజన్ వారు ముఖ్యమంత్రి సహాయనిధికి 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవపల్లి కృష్ణ, ట్రెజరర్ శంకర్, ఇతర సభ్యులు హోంమంత్రి సుచరిత గారిని కలిసి 5 లక్షల రూపాయల చెక్ ను అందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సహాయమందించిన ఏపీ కాటన్ అసోసియేషన్ సభ్యులకు హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కాటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవపల్లి కృష్ణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా లో రోజురోజుకు కరోనా కేసులు కూడా అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకపాటించాలని తెలిపారు. బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, సామాజిక దూరం పాటించడం, అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం తప్పనిసరిగా చేయాలని కృష్ణ పేర్కొన్నారు.