జర్నలిస్ట్ లందరకి " 50 లక్షల భీమాను" వర్తింప చేయాలని ఆంద్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ (ఏ.పి.జే.ఎఫ్) mla కి వినతి పత్రం

 


    నాయుడు పేట, మే 8 (అంతిమ తీర్పు) :                 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో.   కోవిడ్ 19 సమయంలో పని చేస్తున్న జర్నలిస్ట్ లందరకి " 50 లక్షల భీమాను" వర్తింప చేయాలని ఆంద్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ (ఏ.పి.జే.ఎఫ్) తరపున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గార్కి తెలియజేస్తూ సూళ్లూరుపేట శాసన సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య ద్వారా విన్నతి పత్రంను ఏ.పి.జే. ఎఫ్. నియోజకవర్గ ఇంచార్జి ఓరేపల్లి వెంకటేశ్వర్లు శుక్రవారం ఇవ్వడం జరిగింది. జర్నలిస్ట్ లకు  ప్రభుత్వం కల్పిస్తున్న " హెల్త్ స్కీం" గడువు ముగిసిందని తిరిగి రెన్యూవల్ కోసం అధికారకంగా ఆదేశాలు ఇవ్వాలని శాసన సభ్యులులకు తెలపడం జరిగింది. శాసన సభ్యులు స్పందిస్తూ ఈ రెండు విషయాలను ముఖ్యమంత్రి గార్కి తెలియపరుస్తానని తెలిపారు. ఫోరమ్ సభ్యులు దార రామదాసు, అల్లా భక్ష, ఆనంద్, వెంకటేశ్వర్లు, రమణయ్య,చిన్న రావ్ ఉన్నారు.