కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వస్తె వారిని బస్సులో 50 శాతం కు మించకుండా తరలించాలని ఆదేశాలు : అర్జా శ్రీకాంత్

AP FIGHTS COVID 19
COMMAND CONTROL
*****************************


లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం


కేంద్ర ఆదేశాల మేరకు మార్గదర్శకాలు ఉత్తర్వులు జారీ


రాష్ట్రంలో ని ఇతర జిల్లాల లో చిక్కుకున్న వలస కార్మికులు 1902 కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి


కేవలం గ్రీన్ జోన్ నుండి గ్రీన్ జోన్ లకు మాత్రమే అనుమతి


రిలీఫ్ క్యాంప్ లో నుండి స్వగ్రామాలకు వెళ్లాలి అనుకునే వాళ్ళకు రాండమ్ గా పరీక్షలు


కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వస్తె వారిని బస్సులో 50 శాతం కు మించకుండా తరలించాలని ఆదేశాలు


స్వగ్రామాల్లో సైతం మరోసారి 14 రోజుల క్వారంటైన్, అనంతరం మరో 14 రోజులు హోం క్వారంటైన్


ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తిస్తే ఆ గ్రూపు మొత్తాన్ని అక్కడే ఉంచాల్సిందిగా సూచించిన ప్రభుత్వం


పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లాలని ఆదేశం


ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు


ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్, రైల్వే స్టేషన్ గుర్తించాలని ఆదేశం


ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిన రైల్వే స్టేషన్, బస్టాండ్ చేరుకునేందుకు ఏర్పాట్లు


వచ్చిన వారికి స్క్రీనింగ్ తో సహా, పూల్ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశం


ఇతర రాష్ట్రాల్లో రెడ్ జోన్, కంటెన్మెంట్ జోన్ నుండి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించిన ప్రభుత్వం


ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటెన్ కు పంపి.... పరీక్షల అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి
______________________________
స్టేట్ నోడల్ ఆఫీసర్ COVID 19