జర్నలిస్టులకు 50 లక్షల బీమా వర్తింపచేయాలి  -- ఏపిజేయఫ్ నెల్లూరు జిల్లా కమిటీ

జర్నలిస్టులకు 50 లక్షల బీమా వర్తింపచేయాలి  -- ఏపిజేయఫ్ నెల్లూరు జిల్లా కమిటీ
  
 నెల్లూరు:మే 12 :ముఖ్యమంత్రి జగన్ మెాహన్ రెడ్డి గారికి జర్నలిస్టు సమస్యలను పరిష్కరించగలరని కోరుతూ ఏపిజేయఫ్ రాష్ట్ర విజ్ఞప్తి లేఖను రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి ఆనీల్ కుమార్ యాదవ్ గారి ద్వారా ముఖ్యమంత్రివర్యులకు అందజేయగలరని వినతిని ఇవ్వటం జరిగింది .ప్రతి జర్నలిస్టుకు కరోనా పరీక్షలు నిర్వహించాలని,జర్నలిస్టులకు రూ 50 లక్షల బీమా వర్తింపజేయాలని,క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు యన్ - 95 మాస్క్ లను,శానిటైజర్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించాలని,జర్నలిస్టుల కుటుంబాలకు లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు,కుటుంబ పోషణ నిమిత్తం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని,నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాలు కేటాయించాలని,జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పట్టణ గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం(ఏపిజేయఫ్) విజ్ఞప్తి చేసింది.కరోనా వైరస్ నియంత్రణ కొరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఏపిజేయఫ్ తెలియజేసింది.కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న డాక్టర్లు,వైద్య సిబ్బంది,పోలీసులు,రెవెన్యూ,పారిశుద్ధ్య కార్మికులు జర్నలిస్టులకు ఏపీ జే ఎఫ్ అభినందనలు తెలిపింది.


నెల్లూరు జిల్లాలోని జర్నలిస్ట్ లకు సి.ఎస్. ఆర్ నిధులతో నిత్యావసర వస్తువులు అందజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్టు ఫోరం(ఏపిజేయఫ్) నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షులు ఆకుల పురుషోత్తం బాబు (సింహపురి బాబు),అధ్యక్షుడు శాఖమూరి శ్రీనివాసులు ,ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బుసింగ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్.దిలిప్, ఉపాధ్యక్షులు నన్నూరు శ్రీనివాసరావు, ఓ. వెంకటేశ్వర్లు,  జాయింట్ సెక్రెటరీ జయ కుమార్ సింగ్ కమిటీ సభ్యులు శ్రీ హరి ప్రసాద్,          వి.రమేష్ కుమార్,  అంతిమ తీర్పు పత్రిక ఎడిటర్ వల్లూరు ప్రసాద్ కుమార్ , జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image