అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు అండగా స్వచ్చంధ సంస్థలు ముందుకు రావడం అభినందనీయం: డి.జి.పి


*రాష్ట్రంలోని వైరస్ నివారణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు అండగా స్వచ్చంధ సంస్థలు ముందుకు రావడం అభినందనీయం.
  అమరావతి   మే,6 (అంతిిిమ తీర్ప):     కెరోన మహమ్మారి నుండి నిరంతరం ప్రజలను జాగృతం చేస్తూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిర్వీరామంగా విధులు నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు రాష్ట్రం నలుమూల  నుండి పలు స్వచ్చంధ సంస్థలు, ప్రజాప్రతినిధులు, ఎన్.ఆర్.ఐలు,   పూర్వ విధ్యార్ధి  సంఘల నుండి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయం లో పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు మాస్క్ లు, సానిటైజర్ లను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ IPS గారికి అందజేశారు. వారిలో CLA to DGP రమణరాయులు 150 పి‌పి‌ఈ కిట్లు, ఆంధ్ర లయోలా కళాశాల పూర్వ విధ్యార్ది సంఘం 4000 సానిటైజర్ లు, మాజీ పోలీస్ అధికారి  శివానంద్ రెడ్డి 20,000 మాస్క్ లు, యంపి.బలశౌరి 2000 పాకెట్ సానిటిజెర్  లను అందించారు.ఈ సందర్భంగా డి‌జి‌పి మాట్లాడుతూ ఈ విపత్కర సమయంలో  విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంధికి బాసటగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో Add.DG L&O శ్రీ రవిశంకర్ అయ్యనార్, Add DG Welfare శ్రీధర్ రావు, IG, పీ & ఎల్ శ్రీ నాగేంద్ర కుమార్,శ్రీ  మహేష్ చంద్ర లడ్డ ,IPS, OSD వెల్ఫేర్  రామకృష్ణ  పాల్గొన్నారు.