వింజమూరు మండలం లో ఉదయం  6.00 నుండి 9.00 గంటల వరకు మాత్రమే అనుమతి: వింజమూరు తహశీల్దారు ఎం.వి.సుధాకర్

వింజమూరు మే 18(అంతిమ తీర్పు) :      శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వింజమూరు మండలంలోని యావన్మంది ప్రజలకు తెలియచేయడమైనది ఏమనగా, వింజమూరు మండలం నల్లగొండ గ్రామములో రెండు కరోనా పాజిటివ్ కేసులు వచ్చినందున ఈ క్రింది తెలిపిన షాపులకు ఉదయం  6.00 నుండి 9.00 గంటల వరకు మాత్రమే అనుమతి ఉన్నదని వింజమూరు తహశీల్దారు ఎం.వి.సుధాకర్ బాబు అంతిమ తీర్పు ప్రతినిధికి తెలిపారు.
1.మెడికల్ షాపులు (24 గంటలు అందుబాటులో ఉంటాయి)
2.కూరగాయలు
3.పాలు
4.నిత్యావసర సరుకులు( కిరాణా )
5.మంచి నీళ్ళు కు తప్ప ఏ ఇతర షాపులకు అనుమతి లేదు అని ఆయన అన్నారు. ప్రజలంతా సహకరించాలని ఆయన  కోరారు.