జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి

*కోడిమి జర్నలిస్ట్ కాలనీ జులైలో ప్రారంభం..*


*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభానికి కృషి..*


*మాంచో ఫెర్రర్ కు (ప్రోగ్రామ్ డైరెక్టర్ RDT) అభినందనలు*


*జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం*


*నెరవేరనున్న అనంత జర్నలిస్టుల సొంతింటి కల*


*మచ్చా రామలింగా రెడ్డి, I.J.U సభ్యులు, అధ్యక్షుడు జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ పిలుపు.*
*౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼*


🏠రాష్ట్రంలోనే మొట్టమొదట జర్నలిస్ట్ కాలనీ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో.. అనంతపురం నగరంలోని కొడిమి జర్నలిస్ట్ కాలనీ జూలై నెల చివర్లో ప్రారంభం చేయాలని మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) అధ్యక్షులు జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ పిలుపునిచ్చారు.


👉ఈరోజు ఉదయం కోడిమి జర్నలిస్ట్  కాలనీ నందు జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మచ్చా రామలింగారెడ్డి పాల్గొని ప్రసంగించారు.


🙏గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా కాలనీలో ఇల్లు ప్రారంభించాలని, RDT మాంచో ఫెర్రర్ సహకారంతో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది.


🙏స్థానిక శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రిని ఆహ్వానించాలని మచ్చా రామలింగారెడ్డి సూచించారు.


🏠RDT ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో  ఫెర్రర్ ను అభినందిస్తున్నానని కాలనీలో ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చినందుకు ఆర్డిటి సంస్థకు జర్నలిస్టులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.


✍అనంతరం నగర జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరబోతోందని కాలనీలో ఐకమత్యంతో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు, డ్రైనేజీ ఇతర సౌకర్యాలు కల్పించుకోవాలిని సూచించారు. కాలనీ అభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేశారు, కమిటీ కన్వీనర్ గా సాక్షి నగేష్ ని మచ్చా రామలింగారెడ్డి నియమించారు.


👉ఈ సమావేశంలో లో సొసైటీ కార్యదర్శి విజయరాజు, సాక్షి నగేష్, సతీష్, రాము, రంగనాథ్, ఈనాడు రవి కిరణ్, హిందూ ప్రసాద్ ఫోటోగ్రాఫర్, సొసైటీ సభ్యులు దామోదర్ రెడ్డి, మంజునాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ ప్రసాద్, ఆది, సూర్యప్రకాష్ రెడ్డి కమిటీ సభ్యులు మల్లికార్జున, ప్రకాష్, రమణ, నాయక్, దిలీప్ హనుమంత్ రెడ్డి, బాలు, జూని, షాకీర్ నాగేంద్ర, ఉపేంద్ర, జీవన్ తదితరులు పాల్గొన్నారు.


💎DIST... JOURNALIST DEVELOPMENT SOCIETY, ANANTAPURAMU💎