ఇప్పటి వరకు 80 మందికి పరీక్షలు నిర్వహించిన 11 మందికి పాజిటివ్ లక్షణాలు :చిత్తూరు కలెక్టర్

చిత్తూరు. ,మే 9. చిత్తూరు జిల్లాలో చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కు పలుమార్లు వెళ్లి వచ్చిన లారీ డ్రైవర్లు క్లీనర్లు మరియు మండలాలకు సంబంధించిన సిబ్బంది కి పరీక్షలు నిర్వహించామని ఇందులో ఇప్పటివరకు పదకొండు పాజిటివ్ కేసులు వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల చెన్నై కోయంబేడు మార్కెట్ కాంట్రాక్టులకు సంబంధించి వివరాలు సేకరించడం జరిగింది అని ఇందులో 160 మంది కి ప్రైమ్ కాంటాక్ట్ లో ఉన్నట్లు తెలిసిందని ఇప్పటి వరకు 80 మందికి పరీక్షలు నిర్వహించిన 11 మందికి పాజిటివ్ లక్షణాలు వచ్చాయి మరో 80 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అదేవిధంగా వీరికి సంబంధించిన కాంట్రాక్టులు గా మరో వెయ్యి మందికి రెండు రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు