చిట్టేడిమిట్ట వాసులకు టి.డి.పి నేత 'గూడా ' బియ్యం పంపిణీ

*చిట్టేడిమిట్ట వాసులకు టి.డి.పి నేత 'గూడా ' బియ్యం పంపిణీ


* వింజమూరు, మే 10 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలోని చిట్టేడిమిట్టలో ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గూడా.నరసారెడ్డి, ఆయన కుమారులు గూడా.నరేంద్రరెడ్డి, నవీన్ రెడ్డిలు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గూడా.నరసారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఆదుకునేందుకు వింజమూరు మండలంలో దాతలు విరివిగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మనసున్న మారాజులుగా వింజమూరు కీర్తి ప్రతిష్టలను జిల్లా నలుమూలలా వ్యాపింపజేయడం అభినందనీయమన్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో కరోనా వైరస్ ముప్పు నుండి ఊపశమనం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా.చంద్రబాబు నాయుడు  ప్రజలకు ఇస్తున్న సందేశాలు చరిత్రలో సువర్ణాక్షరాలలో లిఖించబడిన అమూల్యమైన సందేశాలన్నారు. ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని.వెంకటరామారావు పిలుపు మేరకు పేదలకు తన వంతు సాయం అందించేందుకు గానూ చిట్టేడిమిట్టలో పలువురు పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం ఆయన యర్రబల్లిపాళెంలోని తన స్వగృహంలో మీడియా మిత్రులతో కలిసి సహపంక్తి భోజనాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో వింజమూరు మండల టి.డి.పి మాజీ కన్వీనర్ యన్నం.రామచంద్రారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు గొంగటి.రఘునాధరెడ్డి, బి.సి సెల్ నేత బద్దిక.సుబ్బరాయుడు, ఎస్.సి సెల్ నేత కావేటి.ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.