లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వికలాంగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి  -

లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వికలాంగుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి  - ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సి నాగరాజు డిమాండ్ 
ఎమ్మిగనూరు,మే,11 (అంతిమతీర్పు):-ఎమ్మిగనూరు పట్టణంలోని  సోమవారం ఉదయం 11 గంటలప్రాంతంలో  ఎమ్మిగనూరు తాలూకా వికలాంగుల సంక్షేమ హక్కుల సాధన సమితి  అధ్యక్షులు K. రామాంజనేయులు, ఆర్గనైజింగ్ B. C. నాగరాజులు విలేకరులతో మాట్లాడుతూ గత రెండు మాసాలుగా కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఇటు వర్తక, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్న, స్వయం ఉపాధి చేసుకుని జీవిస్తున్న ఎంతోమంది మా వికలాంగులు రోడ్డున పడ్డారనివారు తెలిపారు. కాబట్టి వీరి,వీరి కుటుంబాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందనివారు అన్నారు. ప్రభుత్వం ఇచ్చే చాలీచాలని పెన్షన్ తో, సమాజంలో ఎటువంటి ఆర్థిక, సహాయ, సహకారాలు అందక పూట గడవడమే కష్టంగా మారిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వికలాంగులే కకావికలం అవుతున్న తరుణంలో మా వికలాంగులు ఇంకెంత నిస్సహాయ, దయానియ పరిస్థితుల్లో ఉన్నారో ప్రభుత్వం, పాలక పక్షకులు అర్థం చేసుకోవాలనివారు తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వికలాంగులకు ఇచ్చే పింఛన్ను కాక ప్రతి వికలాంగునికి 10వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం, 4నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల భత్యాన్ని వెంటనే ఇచ్చే  ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.లేకపోతే  వికలాంగులంతా త్వరలోనే  కలెక్టరేట్ ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి టైలర్ సాయిబన్న, పెద్దయ్య, రాజశేఖర్, నర్సింహులు, రఘు తదితరులు పాల్గొన్నారు.