రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ - 94 శాతం పెన్షన్ పంపిణీ చేసిన వాలంటీర్లు

01.5.2020
అమరావతి


- రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ


- (సాయంత్రం 5 గంటల వరకు) 94 శాతం పెన్షన్ పంపిణీ చేసిన వాలంటీర్లు


- (సాయంత్రం 5 గంటల వరకు) పెన్షన్ అందుకున్న 53 లక్షల మంది


- మొత్తం రూ.1300 కోట్లు పంపిణీ.


- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పెన్షన్లు 58.22 లక్షలు 


- పింఛన్ కోసం రూ.1421.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.


- ఇంటింటికి వెళ్ళి పెన్షనర్ల చేతికే పెన్షన్ అందచేసిన వాలంటీర్లు.


- పెన్షన్ల పంపిణీలో నిమగ్నమైన 2,37,615 మంది వాలంటీర్లు.


- కరోనా నియంత్రణలో భాగంగా ప్రత్యేక మొబైల్ యాప్


- జియో ట్యాగింగ్ ద్వారా లబ్దిదారుల ఫోటోలు


-  పోర్టబిలిటీ ద్వారా కూడా పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు.


- పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించిన పిఆర్అండ్ ఆర్డీ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెర్ఫ్ సిఇఓ పి.రాజాబాబు.


కరోనా వైరస్ సృష్టిస్తున్న ఆలజడిలోనూ ఎపి ప్రభుత్వం పట్టుదలతో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లింది. ప్రతినెలా ఒకటో తేదీనే వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, గుర్తించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్ సొమ్మును వారి చేతికే అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ప్రభుత్వ యంత్రాంగం, వాలంటీర్ల వ్యవస్థ ఉద్యమ స్పూర్తితో నెరవేర్చింది. ఉదయం నుంచే వాలంటీర్లు తమకు కేటాయించిన యాబై ఇళ్ళ పరిధిలోని వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారుల వద్దకు వెళ్ళి వారికి స్వయంగా పెన్షన్ సొమ్మును అందించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2, 37,615 మంది వాలంటీర్లు కష్టపడి పనిచేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సంకల్పంను కార్యరూపంలోకి తీసుకురావడానికి సెక్రటేరియట్ స్థాయి ఉన్నతాధికారుల నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగుల వరకు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ఫ్) సిఇఓ పి.రాజాబాబు స్వయంగా పశ్చిమగోదావరిజిల్లా కలపర్రు గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులను ఉత్సాహపరుస్తూ, వాలంటీర్లకు స్పూర్తినిస్తూ వారు సైతం పెన్షన్లను పంపిణీ చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 94 శాతం మందికి, అంటే దాదాపు 53, 01,212 మంది లబ్ధిదారులకు పెన్షన్ ను అందించారు. ముఖానికి మాస్క్ లు ధరించి, శానిటైజర్లను ఉపయోగిస్తూ, భౌతికదూరం పాటిస్తూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి కోవిడ్ -19 నియంత్రణ నిబంధనలు ఎక్కడా ఆటంకం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కోవిడ్ – 19 నియంత్రణ చర్యల్లో భాగంగా పెన్షనర్ల బయో మెట్రిక్ వేయకుండా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మొబైల్ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా జియోట్యాగింగ్ తో కూడిన ఫోటోలను వాలంటీర్లు ఫోన్ లో అప్ లోడ్ చేస్తూ పెన్షన్లను పంపిణీ చేశారు. 
మే నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రభుత్వం మొత్తం 1421.20 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రెండు రోజుల కిందటే కే ఈ మొత్తంను పేదరిక నిర్మూలనాసంస్థ (సెర్ఫ్) ద్వారా రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు జమ చేసింది. సచివాలయ కార్యదర్శుల నుంచి సొమ్మును వాలంటీర్లకు అందచేయడం ద్వారా, శుక్రవారం ఉదయం నుంచే నేరుగా పెన్షనర్ల చేతికి పింఛన్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఎక్కడైనా పెన్షనర్లు ఇతర ప్రాంతాల్లో వుండి పోయినట్లయితే, వారిని కూడా గుర్తించి, పోర్టబిలిటీ ద్వారా పెన్షన్ సొమ్మును అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో పాటు గుర్తింపు పొందిన వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా నెల ఒకటో తేదీనే పెన్షన్ సొమ్ము అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవి, డయాలసిస్ పెషంట్లకు డిబిటి విధానంలో శుక్రవారం పెన్షన్ సొమ్మును జమ చేశారు. ఎవరైనా మే నెల పెన్షన్ సొమ్మును అనివార్య కారణాల వల్ల అందుకోలేక పోతే, వారికి జూన్ నెలలో అందచేసే పెన్షన్ కు ఈ నెలది కూడా కలిపి అందిస్తామని సెర్ఫ్ సిఇఓ పి.రాజాబాబు వెల్లడించారు. 


*జిల్లాల వారీగా పెన్షన్ల పంపిణీ:*


వైఎస్ఆర్ కడప: 3,11,214


చిత్తూరు : 4,62,235


విజయనగరం: 3,01,800


ప.గో.జిల్లా : 4,38,496


విశాఖపట్నం: 4,09, 170


శ్రీకాకుళం : 3,39,498


అనంతపురం: 4,73,717


తూ.గో.జిల్లా: 5,76,488


 నెల్లూరు : 3,16,935


కర్నూలు : 3,88,725


కృష్ణా: 4,42,987


ప్రకాశం : 3,57,739


గుంటూరు: 4,82,208


 
*ఒక్కరోజులో రూ.1300 కోట్లు పంపిణీ: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*


రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజున యాబై మూడు లక్షలకు పైగా పెన్షన్ లబ్దిదారులకు రూ.1300 కోట్లకు పైగా పెన్షన్ సొమ్మును వారికి నేరుగా అందించిన వాలంటీర్లను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, పెన్షన్ల పంపిణీని విజయవంతం చేయడంలో వాలంటీర్లు చిత్తశుద్దితో పనిచేశారని అన్నారు. గ్రామస్థాయిలో పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేసిన సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ సాధిస్తున్న ఫలితాలకు పెన్షన్ల పంపిణీ నిదర్శనమని కొనియాడారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image