ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కి కన్నా లక్ష్మీనారాయణ లేఖ

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ .    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కి లేఖ రాశారు..


లేఖలోని ప్రధానమైన అంశాలు..


కరోనా మహమ్మారి విపత్తు కారణంగా లక్షలాది మంది వలస కార్మికులు,విద్యార్థులు,పర్యాటకులు మరియు ఇతర ప్రజానీకం ప్రయాణ వెసులుబాటు లేక వివిధ రాష్ట్రాలలో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు.


ముఖ్యంగా వీరిలో అత్యధికంగా వలస కార్మికులు ఉన్నారు.లాక్-డౌన్ కారణంగా వ్యాపార లావాదేవీలు,భవన నిర్మాణాలు మొదలైన రంగాలలో ఉపాధి అవకాశాలు నిలచి పోవడంతో వారు వారి స్వస్థలాలకు చేరుకోవాలని ఆందోళనతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.


కేంద్ర ప్రభుత్వం ఒంటరిగా ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యల పరిష్కరించడానికి కొన్ని సలహాలు సూచనలు ఇప్పటికే మార్గదర్శనం చేసింది.


మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు నోడల్ ఆఫీసర్స్ నంబర్లు లక్షలాది బాధితులు సరిపోయే అవకాశం లేక పోగా వారి సహాయం కోసం చేసే ప్రయత్నం విఫలం చెందే అవకాశం ఉంది.


కావున భారతీయ జనతా పార్టీ నుంచి కొన్ని సూచనలు చేస్తున్నాను.ముఖ్యంగా


1. బాధితుల సమస్యల పరిష్కారించడానికి రాష్ట్ర స్థాయిలో 10 నుంచి 12 హెల్ప్-లైన్లు ఏర్పాటు చేసి మల్టీ-లైన్ల సదుపాయం ఏర్పాటు చేయడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.


2. జిల్లా స్థాయిలో 10 నుంచి 12 హెల్ప్-లైన్లు ఏర్పాటు చేసి మల్టీ-లైన్ల సదుపాయం ఏర్పాటు చేయడం ద్వారా అన్ని వర్గాల బాధితులకు సత్వరం సహాయం అందుతుంది.


పైన చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.


                బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,
                కన్నా లక్ష్మీనారాయణ.