మృతుడి ఫార్చ్యూనర్ వాహనం స్వాధీనం

మృతుడి ఫార్చ్యూనర్ వాహనం స్వాధీనం


వింజమూరు, మే 6 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరు మండలం చౌటపల్లి గ్రామంలో ఇటీవల దారుణ హత్యకు గురైన మేడిపల్లి.వెంగళరావుకు చెందిన ఫార్చ్యూనర్ వాహనాన్ని ఎట్టకేలకు పోలీసులు స్వాధీనం చేసుకుని వింజమూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ కావలి డి.యస్.పి ప్రసాద్, కలిగిరి సి.ఐ రవికిరణ్ ఆదేశాల మేరకు ముమ్మరంగా దర్యాప్తు నిర్వహించి దుత్తలూరు మండలంలోని బండక్రిందపల్లి అటవీ ప్రాంతంలో నిందితులు వదిలేసి వెళ్ళిన వాహనాన్ని గుర్తించడం జరిగిందన్నారు. వెంగళరావు అదృశ్యమయ్యాడని అతని సమీప బంధువు అందించిన సమాచారంతో 24 గంటల వ్యవధిలోనే కేసును చేధించడంలో భాగంగా వెంగళరావు మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని కనుగొని మృతదేహమును వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించామన్నారు. మృతుడు వెంగళరావు తిరిగే ఫార్చ్యూనర్ వాహనాన్ని కనిపెట్టడంతో పాటు హత్యలో పాల్గొన్న మిగతా నిందితుల ఆచూకీ కోసం ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఈ సంధర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి తెలియజేశారు.