AP COVID 19 COMMAND CONTROL ***************************** కార్యాలయాల్లో పనిచేయు ఉద్యోగులు కోవిడ్19 నుండి తమను తాము రక్షించుకుంటూ సురక్షితముగా తమ విధులు నిర్వహించుకొనుటకు గాను సూచించబడిన కార్యాలయ ఏర్పాట్లు మరియు నివారణ చర్యల మార్గదర్శకాలు. నేపధ్యము కార్యాలయాలు మరియు పనిచేయు ప్రదేశాల లో కారిడార్లు, ఎలివేటర్లు & మెట్లు, పార్కింగ్ స్థలాలు, ఫలహార శాల, సమావేశ గదులు మరియు సమావేశ మందిరాలు మొదలైన సౌకర్యాలు చాలా వరకూ ఒకే విధంగా ఉంటాయి. ఉద్యోగులు ఉమ్మడిగా ఉపయోగించుకునే ఇటు వంటి సౌకర్యాల ప్రదేశాల వల్ల అధికారులు, సిబ్బంది మరియు సందర్శకులలో కోవిడ్19 చాలా వేగంగా వ్యాపించే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. కార్యాలయాలలో పనిచేయు సిబ్బంది కోవిడ్19 బారి నుండి తమను తాము రక్షించుకుంటూనే తమ విధులను సురక్షితముగా నిర్వహించుకొనుటకు గాను కార్యాలయాలలో చేయవలసిన మార్పులు చేర్పులు మరియు పాటించవలసిన ప్రామాణిక మార్గదర్శక నియమాల గురించి ఈ కింది సూచించిన విధంగా విభాగాలుగా విభజించి అమలు చేయబడుతుంది. అన్ని సమయాల్లో అందరూ పాటించవలసిన ప్రాథమిక నివారణ చర్యలు. కార్యాలయాలలో కోవిడ్19 నిరోధించుటకు గాను చేపట్టవలసిన ప్రత్యేక చర్యలు కార్యాలయ సిబ్బంది కోవిడ్19 ప్రభావానికి గురయినపుడు తీసుకోనవలసిన చర్యలు. కార్యాలయ సిబ్బంది కోవిడ్19 అనుమానితుడిగా లేదా ధృవీకరించబడిన వ్యక్తిగా నిర్ధారించ బడినపుడు చేపట్టవలసిన క్రిమి సంహారక చర్యలు. పాటించవలసిన ప్రాథమిక నివారణ చర్యలు. కార్యాలయం లో COVID-19 సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి అనుసరించాల్సిన ప్రాథమిక నివారణ మరియు సాధారణ ప్రజారోగ్య ఈ చర్యలను ఉద్యోగులు మరియు సందర్శకులు అన్ని సమయాల్లో పాటించాలి. మరియు వీటితో పాటు ఈ కింద సూచించబడిన రక్షణ విధానాలు ఖచ్చితముగా పాటించాలని కొరడమైనది. అన్నీ సందర్బాలలో సిబ్బందికి మరియు సందర్శకుల మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేలా జాగ్రత్త పడాలి. కార్యాలయ పని వేళల్లో సిబ్బంది మొహానికి ఫేస్ కవర్లు మరియు మాస్కు లు వాడడం తప్పని సరి. చేతులను తరచుగా కనీసం 20 సెకండ్ల పాటు ఆల్కహాల్ ఆధారిత హాండ్ శానిటైజర్ ద్వారా గాని లేదా 40 నుండి 60 సెకండ్ల పాటు సబ్బు నీటితో కడగడం చేయాలి. శ్వాస కోశ సంబంధ మర్యాదలు సూచించిన విధంగా ఖచ్చితముగా అలవాటు చేసుకోవాలి. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు కర్చీఫ్ అడ్డుపెట్టు కోవడం లేదా టిస్యూ పేపర్ వాడడం లేదా ముక్కు నోరుని ఆ సమయం లో మోచేతిని అడ్డు పెట్టుకోవడం ద్వారా కవర్ చేసుకోవడం తో పాటు ఉపయోగించిన టిస్యూ పేపర్ ని సరైన రీతిలో పారవేయాలి. సిబ్బంది తమ ఆరోగ్య లక్షణాల గురించి తామే అనుక్షణం గమనించుకుంటూ ఏదేనా అనుమానిత లక్షణాలు గమనించినపుడు వెంటనే స్పందించి తగిన చికిత్స తీసుకోవాలి. *కార్యాలయాలలో కోవిడ్19 నివారణకు చేపట్టవలసిన చర్యలు.* కార్యాలయాల లో కోవిడ్19 నివారణ చర్యలకు సంబంధించి అనుసరించవలసిన మార్గదర్శకాలను డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ ద్వారా జారీ చేయబడ్డాయి. ఏ సిబ్బంది అయినా ఫ్లూ వంటి అనారోగ్యానికి గురయినపుడు కార్యాలయానికి హాజరు కాకూడదు. సిఎస్ (ఎంఏ) వైద్య హాజరు కింద స్థానిక CGHS ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆ సెంటర్ యొక్క ఆరోగ్య అధికారుల నుండి వైద్య సలహా తీసుకోవాలి. ఒకవేళ ఆ వ్యక్తి కోవిడ్19 యొక్క అనుమానితుడు లేదా ధృవీకరించబడిన వ్యక్తి గా నిర్ధారణ అయినట్లయితే ఆ సమాచారం ను వెంటనే కార్యాలయ అధికారులకు తెలియజేయాలి. ఉద్యోగి తన నివాస ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్ కార్యకలాపాలు అమలుపరచడం వలన కార్యాలయానికి హాజరు కాలేని సందర్భం లో ఇంటి నిర్బంధాన్ని అభ్యర్థించే ఏ సిబ్బంది అయినా ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాలి. సమావేశాలను నిర్వహించడానికి సంబంధించి సందర్శకులను సమన్వయం చేయడం అనేది డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలు చాలా జాగ్రత్తగా అమలు చేయబడతాయి. *కార్యాలయం లో సిబ్బంది కోవిడ్19 ప్రభావానికి గురైనపుడు తీసుకోవాల్సిన చర్యలు.* ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులలో కోవిడ్19 ప్రభావానికి గురయ్యే అవకాశాలు సంభవించడాన్ని తోసిపుచ్చలేము. అటువంటి పరిస్థితులలో *ఈ క్రింది చర్యలు తీసుకోబడతాయి.* 5.1. ఒకే గది లో లేదా కార్యాలయం లో చాలా దగ్గరగా పనిచేసే సిబ్బందిలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కోవిడ్19 సూచించే లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించినప్పుడు. 5.1.1. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కార్యాలయంలో ఇతర ఆరోగ్యకరమైన వ్యక్తుల నుండి వేరుచేసి వేరే గదిలో లేదా వేరే ప్రదేశంలో ఉంచండి. అతను / ఆమె ను ఒక వైద్యుడు వచ్చి పరీక్షించే వరకు అతను / ఆమె కు ముసుగు లేదా మాస్క్ ఇవ్వండి. 5.1.2. సంబంధిత కేంద్ర లేదా రాష్ట్ర ఆరోగ్య అధికారులకు తెలియపరచాలి. మరియు హెల్ప్‌ లైన్ 1075 కు వెంటనే సమాచారం ఇవ్వాలి. 5.1.3. నియమించబడిన ప్రజారోగ్య అధికారం లేదా జిల్లా RRT / చికిత్స చేసే వైద్యుడు చేత వైరస్ తీవ్రత అంచనా వేయబడుతుంది మరియు తదనుగుణంగా కేసు నిర్వహణ, అతని / ఆమె పరిచయాలు మరియు చేపట్టవలసిన క్రిమిసంహారక చర్యల గురించి మరిన్ని సలహాలు ఇవ్వబడతాయి. 5.1.4. ఆరోగ్య అధికారుల అంచనాలు అనుసరించి సదరు వ్యక్తిలో చాలా తేలికపాటి లేదా తేలికపాటి లక్షణాలను గుర్తించినట్లయితే సదరు వ్యక్తి హోమ్ ఐసోలేషన్ లో ఉంచబడతాడు, ఇది వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా విడుదల చేయబడ్డ మార్గదర్శకాల ప్రమాణాలు కు లోబడి ఉంటుంది. సదరు మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి 5,1,5, ఆరోగ్య అధికారులు అనుమానిత కేసు మితమైన మరియు తీవ్రమై నదిగా అంచనా వేస్తే, అతను / ఆమె విషయం లో ప్రభుత్వ సూచనలను పాటిస్తారు 5.1.6. ప్రభావిత వ్యక్తి యొక్క పరిచయాల జాబితాను తయారు చేయుటకు గాను సంబంధిత జిల్లా యొక్క ర్యాపిడ్ యాక్షన్ టీం కు తెలియచేయ బడి అభ్యర్థించడం జరుగుతుంది. 5.1.7. రోగి యొక్క నివేదిక కోవిడ్19 గా గుర్తించబడిన తర్వాత అతని యొక్క కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు పని ప్రదేశం ని క్రిమి సంహారకం చేయడము కోసం అవసరమైన చర్యలు ప్రారంభమవుతాయి. **5.2. ప్రీ-సింప్టోమాటిక్ /* అసింప్టోమాటిక్ కేసు నుండి పెద్ద సంఖ్యలో పరిచయాలు ఉంటే, కార్యాలయ పరిధిలో క్లస్టర్ ఉద్భవించే అవకాశం ఉంది. కార్యాలయములో ఇరుకైన పని ప్రదేశ కారణంగా ఇది పెద్ద క్లస్టర్ గా మార్పుచెందవచ్చు .(>15కేసులుకంటేఎక్కువ). రిస్క్ అసెస్‌మెంట్, ఐసోలేషన్ మరియు పరియాల నిర్బంధం, కేస్ రిఫెరల్ మరియు మేనేజ్‌మెంట్ యొక్క ముఖ్యమైన సూత్రాలు అలాగే ఉంటాయి.అయితే వీటి ఏర్పాట్ల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది *5.3. పరిచయాల నిర్వహణ* . అధిక రిస్క్ ఎక్స్పొజర్ పరిచయాలు 14 రోజులు పాటు నిర్బంధించబడతాయి. వారు ఇంటి దిగ్బంధంపై సూచించిన మార్గదర్శకాలను పాటిస్తారు. ఈ వ్యక్తులు ICMR ప్రోటోకాల్ ప్రకారం పరీక్ష చేయించుకోవాలి తక్కువ రిస్క్ ఎక్స్పోజర్ గురయిన వ్యక్తులు పని చేస్తూనే ఉంటారు మరియు వారిని వచ్చే 14 రోజులు పాటు వారి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తారు. కార్యాలయాన్ని మూసివేయడం కార్యాలయం లో ఒకటి లేదా రెండు కేసులు గుర్తించబడితే గత 48 గంటల్లో రోగి సందర్శించిన ప్రదేశాలు / ప్రాంతాలకు క్రిమిసంహారక ప్రక్రియ పరిమితం చేయబడుతుంది.కార్యాలయం యొక్క ఇతర ప్రాంతాలలో లేదా మొత్తం కార్యాలయ భవనం లో పనిని నిలిపి వేయవలసిన అవసరం లేదు మరియు నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం క్రిమిసంహారక చర్య నిర్వహించిన తర్వాత పనిని తిరిగి ప్రారంభించవచ్చు ఒకవేళ పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కాబడితే పూర్తి క్రిమిసంహారక చర్యలు చేపట్టిన తర్వాత భవనం మొత్తం 48 గంటలు పాటు మూసి వేయవలసి ఉంటుంది. భవనం పూర్తి క్రిమిసంహారకమై తిరిగి వినియోగించుటకు తగినట్టుగా ప్రకటించే వరకు సిబ్బంది అందరూ ఇంటి వద్ద నుండే పని చేయవలసి ఉంటుంది. ___________________________ డాక్టర్ అర్జా శ్రీకాంత్ స్టేట్ నోడల్ ఆఫీసర్/Covid19