రాష్ట్రంలో ఏడాది కాలంగా పడరాని పాట్లు పడుతున్న  భవన నిర్మాణ కార్మికులు : ద్వజమెత్తిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ.

అమరావతి మే 10,(అంతిమ తీర్పు) :


ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు... కలకాలం ఉండే అందమైన ఇంటిని ఎంతో కష్టపడి నిర్మించే భవన నిర్మాణ కార్మికుల  పరిస్థితి అత్యంత దయనీయం.


రాష్ట్రంలో ఏడాది కాలంగా పడరాని పాట్లు పడుతున్న  భవన నిర్మాణ కార్మికులు.


అశనిపాతంలా మారిన ప్రభుత్వ రాజకీయ కక్ష సాద్గింపు ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు... 


ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ.


ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు... ఏడాది కాలంగా కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆకలి కేకలు భరించలేక... కుటుంబసభ్యుల ఆర్తనాదాలు చూడలేక... ఎంతోమంది అభాగ్యులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


అసలే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.... ఆదాయం కూడా అంతంత మాత్రమే... ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి మిగిలిన ఏకైక ఆదాయ మార్గం భవన నిర్మాణ రంగం. 


నెల రోజుల్లో భారతదేశానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయలను ఆర్జించగల ఏకైక రంగం రియల్ ఎస్టేట్ మాత్రమే. అలాంటి రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూసింది. 


కేవలం కక్షపూరితoగా వ్యవహరిస్తూ భవన నిర్మాణ రంగాన్ని పూర్తిగా కుదేలు చేసింది. 


అందమైన ఇల్లు కట్టే భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు ప్రస్తుత ముఖ్యమంత్రికి వినపడుతున్నట్లుగా లేవు.


వరుస ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులను మరింతగా ఊబిలో పడేలా చేస్తున్నారు. 


పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ సర్కారు... ఎక్కువ శాతం బీసీలున్న భవన నిర్మాణ కూలీలను మాత్రం చిన్నచూపు చూస్తోంది.


అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుకపై నిషేధం విధించడంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. దాదాపు 3 నెలల పాటు ఎలాంటి ఉపాధి లేక... ఏం చేయాలో దిక్కుతోచని స్థితి కార్మికులది. 


ఒక అందమైన ఇంటి నిర్మాణం పూర్తవ్వాలంటే... ఎంతో మంది శ్రమ దాని వెనుక ఉంటుంది. 


భవన నిర్మాణ రంగంలో..  ఇసుక కూలీలు, తాపీ, వడ్రంగి. సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ఎలక్ట్రికల్ ఇలా మొత్తం 22 రకాల కార్మికులు ఆధారపడి ఉన్నారు. 


ప్రస్తుతం ఏపీలో భవన నిర్మాణ కార్మికులు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు.


ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరూ 50 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు 5 సంవత్సరాలకు రెన్యువల్ ఫీజుగా 60 రూపాయలను AP building & other construction workers welfare boardలో  జమ చేస్తున్నారు. 


ఇసుక కొరత, వరదలు, రాజధాని మార్పు వంటి పరిస్థితులు నిర్మాణ రంగంపై తీవ్రంగా ప్రభావం చూపించాయి. 


3 రాజధానుల ప్రకటన రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగంపై బలంగా పడింది. 


రాజధాని అమరావతి పరిధిలో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. చివరికి పెట్టుబడులు పెట్టేందుకు కూడా వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి. 


ఈ ప్రభావం కార్మికులపై బలంగా పడింది.  ఇప్పుడు లాక్ డౌన్ కూడా నిర్మాణ రంగంపై మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా మారింది.


 లాక్ డౌన్ కారణంగా దాదాపు 45 రోజులుగా ఎలాంటి పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


రెక్కాడితే కానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం... కనీసం ఆ దిశగా ఆలోచన కూడా చేయటం లేదు.  నలుగురితో పాటు నారాయణ అన్నట్లుగా వ్యవహరిస్తోందని మండి పడిన పద్మశ్రీ.


లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి నుంచి ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 


ఇదేమీ ప్రభుత్వం జేబులో నుంచో... ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు జేబు నుంచో ఇవ్వటం లేదని... తాము కూడబెట్టుకున్న నిధి నుంచే చెల్లించాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు.


ఇసుక కొరత కారణంగా పనుల్లేక కుటుంబపోషణ భారమైన ఎంతో మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 


ఇదే సమయంలో అమరావతి పనులు నిలిచిపోవడంతో దాదాపు 20 వేల కోట్ల రూపాయల పనులు ఎక్కడి వక్కడే ఆగిపోవడంతో ఆ ప్రభావం కార్మికులపై పడింది.


 ఇలాంటి సమయంలో రేట్లు పెoచడం దారుణమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


లాక్ డౌన్ కు ముందు 250 నుంచి 280 రూపాయలున్న సిమెంట్ బస్తా రేటు... ఇప్పుడు ఏకంగా 380 నుంచి 400 రూపాయలకు వ్యాపారులు అమ్ముతున్నారని ఆరోపించారు. 


ఇసుక ,సిమెంటు రేట్లు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో కొత్త నిర్మాణాలకు ఎవరూ ముందుకు రావడం లేదు. 


ఇసుక సామాన్యులకు అందుబాటులొ ఉంచి , సిమెంట్ రేట్లను నియంత్రించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే...


ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image