జివి ..నీ సేవలు బాగున్నాయ్  -ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రశంసలు

ఓ జివి ..నీ సేవలు బాగున్నాయ్ 


------------ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రశంసలు



 కావలి పట్టణంలోని 34 వ వార్డులో    వైసిపి ఇంచార్జి, సేవతత్పరుడు    గుర్రం వెంకటేశ్వర్లు అలియాస్ జివి,ఆయన స్నేహితుడు పుల్లా శ్రీనివాసులురెడ్డిలు చేస్తున్న సేవలు చాలా బాగున్నాయి అని కావలి శాసన సభ్యులు, అపర భగీరథుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తేరు. శనివారం 34 వ వార్డులో జివి ఆధ్వర్యంలో  ఇంటింటికి చేయూత అనే కార్యక్రమానికి కావలి జననేత, ఎమ్మెల్యే, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి,  స్టార్ పొలిటీషియన్, కావలి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మన్నేమాల సుకుమార్ రెడ్డి లు ముఖ్య అతిథిలుగా హాజరైన్నారు. వార్డులోని ప్రజలకు ఎమ్మెల్యే, ఏ.ఎం.సి ల చేతుల మీదుగా ఆరు కేజీల కూరగాయలు,ఆరు కోడిగుడ్లు, నూనె ప్యాకెట్, స్వీట్ బాక్స్ అందశేచారు. ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై యస్ జగన్మోహన్ రెడ్డి  ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని రాత్రిoబవాళ్ళు కష్ట పడుతూ పాలన సాగిస్తున్నాడు అని అన్నారు. అలాంటి ముఖ్యమంత్రి దొరకడం రాష్ట్ర ప్రజలు చేసుకొన్న అదృష్టం అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సైతం సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రoలో రాజన్న  పాలన చేస్తున్న ఒకే ఒక్కడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రoలో కరోనా మహమ్మరి వల్ల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఏ నియోజకవర్గo లో ఆ నాయకుడు ప్రజలకు చేయూత అందించాలని పిలుపునిచ్చారని అన్నారు.దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వేచ్ఛoదగా చేయుతలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ క్రమంలో కావలిలో దాతలు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవడం చేస్తే అనందముగా ఉందన్నారు. ప్రత్యేకంగా 34 వ వార్డులో జివి చేస్తున్న సేవలు చాలా బాగున్నాయి అని కొనియాడారు. పుల్లా శ్రీనివాసులురెడ్డి ,జివి లు ఇద్దరు  ప్రజలకు సేవలు అందించేందుకు పోటీలు పడుతూ సేవలు అందించడం శుభ పరిమాణం అన్నారు. జివి     వార్డులోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాల్లో పాలు పంచుకొంటూ నిజమైన నాయకుడుగా వార్డు ప్రజల హృదయంలో  స్థానం సంపాదించేడాని ప్రసంశలు కురిపించారు. 600 ల కుటుంబాలకు చేయూత అందించి అదుకొన్నారన్నారు. వార్డులో ఇప్పుడువరకు ముడు దపాలు ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందించడం జరిగిందన్నారు. జివి ఏ కార్యక్రమం చేసిన ప్రత్యేకoగా ఉంటుందని కొనియాడారు. నేను ఎమ్మెల్యేగా గెలవటంలో జివి, పుల్లా శ్రీనివాసులురెడ్డి పాత్ర  ఉందని తన మనస్సులోని మాటను బయటపెట్టారు.అంతేకాకుండా 34 వ వార్డు అంటే టీడీపీకి కంచుకోట లాంటిదని,ఆలాంటి కంచుకోటను బద్దలు కొట్టి వైసీపీ జెండాను ఎగురవేసిన ఓకే ఒక్కడు జివి అని కొనియాడారు. ప్రస్తుతం 34 వ వార్డును వైసీపీ కంచుకోటగా మలచడంలో జివి, పుల్లా శ్రీనివాసులురెడ్డి పాత్ర గణనీయంగా ఉందన్నారు. పార్టీ లోకి ఎంత మంది వచ్చిన నా మనస్సులో వారిద్దరికీ ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. అనంతరం సరుకులు స్వీట్ బాక్స్ కోడిగుడ్లు వార్డు వాలంటరీ లకు మరియు ఆశా వర్కర్లకు మరియు వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి గడపగడపకు అందించడం జరిగింది. సుమారు 600   కుటుంబాలకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.