సేవాదృక్పథంతో  ముందుకు దూసుకెళ్తున్న హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులు ..

సేవాదృక్పథంతో  ముందుకు దూసుకెళ్తున్న హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులు ....


కావలి , మే 10( అంతిమ తీర్పు - N.సాయి ) నెల్లూరు జిల్లా కావలి పట్టణం నందు కరోనా మహమ్మరి వలన  లాక్ డౌన్ కొనసాగుతున్నప్పుడు నుండి  హెల్పింగ్ హాండ్స్ ఫౌండర్ వాకాటి మాల్యాద్రి నరసింహారావు ఆధ్వర్యంలో పూటగడవని నీరు పేద  ప్రజలకు నిత్యం  ఆహారం అందిస్తూ దాతృత్వం చాటుతున్నారు . ఆదివారం నాడు పట్టణం నందు వైసీపీ మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి పెళ్లిరోజు పురస్కరించుకొని స్థానిక శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద   హెల్పింగ్ హాండ్స్ సహకారంతో  వైసీపీ నాయకులు జగదీశ్ రెడ్డి , కనమర్లపూడి నారాయణ , నాగా చారి చేతులు మీదగా 200 మంది యాచకులకు  భోజనం అందజేసి హెల్పింగ్ హాండ్స్  చేస్తున్న సేవలను కొనియాడారు .ఈ  కార్యక్రమంలో సభ్యులు భైరవ , కిషోర్ రెడ్డి , ఎస్.కే నూరు , మనోజ్ ,  హరీష్ తదితరులు పాల్గొన్నారు