కరోనా పాజిటివ్ వ్యక్తి ఇంటికి హైపో క్లోరైట్ స్ప్రే చేసిన : ఎమ్మెల్యే చెవిరెడ్డి..
* అధికార యంత్రాంగంతో అప్రమత్తం చర్యలు
* అదైర్య పడొద్దని ప్రభుత్వ సిబ్బందికి భరోసా
* స్వీయ నిర్బంధం పాటించాలని ప్రజలకు సూచన
తిరుపతి,
కరోనా పాజిటివ్ కేసు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని విద్యానగర్ కాలనీలో నమోదైందని తెలుసుకొన్న ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంటనే స్పందించారు. అధికార యంత్రాంగంతో కలిసి శుక్రవారం హుటాహుటిన కరోనా వచ్చిన వ్యక్తి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ ఇంటికి చెవిరెడ్డి గారు స్వయంగా హైపో క్లోరైట్ పిచికారీ ని స్ప్రే చేశారు. అనంతరం పరిసర ప్రాంతాలలో పిచికారీ స్ప్రే చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. కరోనా పాజిటివ్ కేసు నమోదుతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విదాల చర్యలు చేపడుతోందని వివరించారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి స్వీయ నిర్బంధం పాటించాలని ప్రజలకు భరోసా కల్పించారు. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై మెరుగైన సేవలు అందిస్తున్నారు అని తెలిపారు. బాధ్యత కలిగిన శాసన సభ్యుడిగా నేను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నానని స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఐశులేషన్ లో చికిత్స పొంది సాధారణ వ్యక్తులుగా తిరిగి వస్తున్న సందర్భాలను గుర్తు చేస్తూ ప్రజల్లో దైర్యం నింపారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం అధైర్య పడకుండా అవకాశంగా భావించాలని సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట తిరుపతి రూరల్ ఎంపీడీవో సుశీల దేవి, తహశీల్దార్ కిరణ్ కుమార్, వైద్య సిబ్బంది, పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు.