పౌష్ఠిక ఆహారం అందజేత


వరికుంటపాడు 
గర్భవతులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రo చే బుధవారం పౌష్ఠిక ఆహారo అందజేశారు. ఉదయగిరి సీడీపీఓ ఆదేశాల మేరకు బియ్యం, కోడిగుడ్లు, నూనె ను గువ్వడి మోడల్ అంగన్వాడీ కేంద్రo లో అర్హులకు పంపిణి చేయడం జరిగింది. బిడ్డ ఎదుగుదల, రక్త హీనత లేకుండా ఉండటం కోసం బాలింత లకు  గర్భవతులకు ఈ వస్తువులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ కార్యకర్త మేడిశెట్టి  విజయలక్ష్మి, కాంచెరువు గ్రామ సచివాలయ మహిళా కానిస్టేబుల్  ఎస్ కె ఫరీదా షరీఫ్,  ఆశ వర్కర్ భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.